
తనకు సినిమాలు తప్ప వేరే ప్రొఫెషన్ ఏదీ తెలియదని, ‘పెళ్లి సందడి’ సినిమా మంచి గుర్తింపు తెచ్చిందని పేర్కొన్న శ్రీకాంత్, తాజా చిత్రం ‘మెంటల్’ సినిమాలో చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు చెప్పాడు. నిజాయితీ కలిగిన పోలీసు అధికారి పాత్రలో నటించిన ‘మెంటల్’ సినిమా విడుదల విషయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొందని ‘మెంటల్ పోలీస్’ అంటూ టైటిల్ పెట్టడంపై కోర్టు స్టే కూడా విధించిందని గుర్తు చేశాడు.
చివరకు ‘మెంటల్’ టైటిల్‌తో తాను నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపిన శ్రీకాంత్, ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన “బిచ్చగాడు” సినిమా ముందు తన దగ్గరికే వచ్చిందని, కొన్ని కారణాల వల్ల దానిని వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు. బహుశా ఈ సినిమాను శ్రీకాంత్ చేసి ఉన్నట్లయితే ఫలితం ఈ రేంజ్ లో ఉండేదో గానీ, ప్రస్తుతం మాత్రం ఇప్పటికీ కొన్ని ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది ‘బిచ్చగాడు.’
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…