Telugu

మొత్తానికి చంద్రుడికి గ్రహణం వీడింది!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి గ్రహణం విడినట్టుంది. వాయిదాలతో, తీర్పు రిజర్వ్ లతో తీర్పులను ముందుకు తీసుకువెళ్లిన న్యాయస్థానాలు ఎట్టకేలకు బాబుకి 53 రోజుల తరువాత బాబు అనారోగ్య సమస్యల దృష్ట్యా నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేశారు.

చంద్రబాబు కి బెయిలు రావడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మాకు అసలైన పండుగా ఇప్పుడే వచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఇన్ని రోజులపాటు ప్రజలకు దూరంగా ఉండడం బాబుకి ఇదే తొలిసారి కావడంతో టీడీపీ క్యాడర్ కూడా బాబుకి ఇన్నాళ్లు బెయిలు రాకపోవడంతో నిరుత్సహంలోకి వెళ్లిపోయారు.మొత్తానికి వారి నిరీక్షణకు ఈరోజుతో ముగింపు పలకపోతున్నారు. కాసేపట్లో బాబుతో ములాఖత్ కోసం రాజమండ్రికి బయలుదేరారు నారా లోకేష్ దంపతులు.

ADVERTISEMENT

చంద్రబాబు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, కంటికి వెంటనే క్యాటరాక్ ఆపరేషన్ చేపించాలని బాబు తరుపు న్యాయవాదులు తమ వాదనను న్యాయమూర్తికి వివరించడంతో జస్టిస్. టి మల్లికార్జున్ రావు సానుకూలంగా స్పందించించి బాబుకి మధ్యంతర బెయిలు మంజూరు చేశారు.బాబు కి బెయిలు వస్తుందని ముందుగానే ఊహించిన జగన్ ప్రభుత్వం ఆయన పై కేసుల మీద కేసులు వేస్తుందంటూ వైసీపీ రెబల్ ఎంపీ ఆర్ఆర్ఆర్ వాపోయారు.

ఈ కేసులో జీవో ఇచ్చింది అజయ్ కళ్లెం రెడ్డి, ఔటర్ రింగ్ రోడ్ లో కేసు వేసింది ఆళ్ల రామకృష్ణ రెడ్డి,ఫైబర్ నెట్ కేసు వేసింది గౌతమ్ రెడ్డి,అంగళ్ళు కేసు వేసింది ఉమాపతి రెడ్డి,కె అజయ్ రెడ్డి,ఇప్పుడు తాజాగా వేసిన కేసు వాసుదేవరెడ్డి ఇలా బాబు పై అక్రమ కేసులు పెట్టిన అందరు ఒకే సామజిక వర్గానికి చెందినవారే. అలాగే ఆ కేసులను కట్టేది రఘురామారెడ్డి, కట్టించేది సజ్జల రామకృష్ణ రెడ్డి ఆయనకు ఆదేశాలిచ్చేది అందరికి కంటే పెద్ద రెడ్డి వైస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ వైసీపీ రెబల్ ఎంపీ RRR బాబుకి బెయిలు వచ్చిన సందర్భంగా ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ నేతలు సామజిక మాధ్యమాలలో ‘బాబు పై జగన్ కుట్ర’ అంటూ షేర్ చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Review: USA Premiere Report

Ranabaali is the second collaboration between Vijay Deverakonda and director Rahul Sankrityan. Stay tuned for…

1 hour ago

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

4 hours ago