
ఇటువంటి కార్యక్రమాల్లో చూపించే న్యాయమూర్తులు, న్యాయవాదుల పాత్రలు, వారు పలికే డైలాగులను చూసే నిరక్ష్యరాస్యులు, గ్రామీణులు… న్యాయస్థానాల్లోనూ ఇలాగే జరుగుతుందని నమ్మే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది. తద్వారా న్యాయ వ్యవస్థపై వారిలో తప్పుడు అభిప్రాయం కలుగుతుందని, న్యాయమూర్తులు, న్యాయవాదుల ప్రతిష్ఠకు, హుందాతనానికి భంగం వాటిల్లుతుందని, ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని ఉమ్మడి హైకోర్టు అభిప్రాయపడింది.
జూలై 10, 2014న జబర్దస్త్ షోలో న్యాయ వ్యవస్థను కించపరిచేలా స్కిట్‌ను ప్రదర్శించారంటూ న్యాయవాది వై.అరుణ్‌కుమార్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టులో ఫిర్యాదు చేశారు. కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగేంద్రబాబు, రోజా, యాంకర్లు అనసూయ, రష్మీ, ఇతరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ కేసును కొట్టివేయాలంటూ నాగేంద్రబాబు, రోజా తదితరులు హైకోర్టును ఆశ్రయించగా, దీనిని విచారించిన కోర్టు కేసును కొట్టివేస్తున్నట్టు పేర్కొంది.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…