
దీనిపై సానుకూలంగా తీర్పు వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు తాజా తీర్పు పెద్ద షాక్ అనే చెప్పాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై సుదీర్గంగా విచారణ జరిపి వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్:1ను కొట్టివేస్తున్నట్లు తీర్పు చెప్పింది. ఇది వైసీపీ ప్రభుత్వానికి చెంపదెబ్బవంటిదేనని చెప్పొచ్చు.
టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన కొత్తలో వైసీపీ ప్రభుత్వం ఇదే జీవో నంబర్:1ను చూపిస్తూ పోలీసుల చేత అడ్డుకొని, పాదయాత్ర సాగకుండా నిలిపివేయించాలని విశ్వప్రయత్నాలు చేసింది. కానీ నారా లోకేష్ అమరావతి నుంచి అరసవెల్లికి పాదయాత్రగా బయలుదేరిన అమాయక రైతు కాదు…అడ్డుకొంటే పాదయాత్ర విరమించుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి!
రాజ్యాంగ పుస్తకం పోలీసులకు చూపిస్తూ, “మీరు ఈ రాజ్యాంగం ప్రకారమే పనిచేస్తున్నారా లేక వైసీపీ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారా?” అంటూ గట్టిగా నిలదీశారు. “నన్ను అడ్డుకొన్నా, లేదా నా స్టూలు, మైకు, వాహనం లాక్కుపోయినా కోర్టుకి వెళ్ళి తేల్చుకొంటాను… సిద్దమేనా?” అంటూ పోలీసులను గట్టిగా నిలదీశారు. అప్పుడు కానీ పోలీసులు వెనక్కు తగ్గలేదు.
జీవో నంబర్:1 ఓ నల్లచట్టమని రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలందరూ వాదిస్తూనే ఉన్నారు. అది కోర్టులో నిలబడలేదనే గట్టి నమ్మకంతోనే వారు ఆ జీవోను, దాని ప్రకారం విధించిన ఆంక్షలను పట్టించుకోకుండా సభలు, పాదయాత్రలు, రోడ్ షోలు నిర్వహించుకొంటున్నారు. వారి అభిప్రాయమే సరైనదని నేడు హైకోర్టు తేల్చి చెప్పింది.
కనుక రాజకీయ దురాలోచనతో అటువంటి జీవో తెచ్చినందుకు వైసీపీ సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సుప్రీంకోర్టులో కూడా మొట్టికాయలు వేయించుకొంటేకానీ తృప్తిగా ఉండదు. కనుక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళడం ఖాయమనే భావించవచ్చు.
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…