
ఈ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేయడంతో రెండు ప్రభుత్వాలు కన్సార్టియంగా ఏర్పడితే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఉపరితల రవాణాశాఖతో రైల్వే శాఖ చర్చించి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తెలంగాణ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఏపీ ఎంపీ కేశినేని నానిలు కలిసి అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఈ నెల 27 లేదంటే 28న ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చి మెట్రో రైలును ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు ఇద్దరూ ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. కాగా, ఇరు రాజధానుల మధ్య నడిచేది బుల్లెట్ రైలు కాదని, హైస్పీడ్ రైలని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.
తాజా ప్రతిపాదన ప్రకారం మొదట హైదరాబాద్-విజయవాడల మధ్యనున్న 270 కిలోమీటర్ల దూరాన్ని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే మాదిరిగా 8 లేన్లుగా విస్తరిస్తారు. అదే సమయంలో హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా చేపట్టనున్నట్టు సమాచారం. రెండు రాజధానుల మధ్య రైలు, రోడ్డు అనుసంధానాన్ని పెంచి, అభివృద్ధి కారిడార్‌గా మార్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…