
2 నుంచి 3 వేల ఎకరాలతో పూర్తయ్యే పోర్టు విస్తరణకు లక్ష ఎకరాల భూముల సేకరణ ఎందుకంటూ విపక్షం వైసీపీ సహా వామపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అంతేకాక నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోర్టు వద్ద నిరసనకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మచిలీపట్నం హైవేపై ఉన్నట్టుండి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) బలగాలు ప్రత్యక్షమయ్యాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆర్పీఎఫ్ జవాన్లు అక్కడ కవాతు చేశారు.
శాంతియుతంగా నిర్వహించనున్న ఆందోళనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకే బలగాలను రంగంలోకి దించిందని విపక్షం ఆరోపిస్తుంటే… బందరు పోర్టు ఆందోళనకు, ఆర్పీఎఫ్ బలగాల మోహరింపునకు ఎలాంటి సంబంధం లేదని అధికార టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా… ఆర్పీఎఫ్ బలగాల పరేడ్ తో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…