Telugu

హిట్ -3…నాని వైలెన్స్ పర్ఫార్మన్స్..!

వాల్ పోస్టర్ సినిమాస్ పేరుతో నాని నిర్మాత గా మొదలైన హిట్ సిరీస్ ఇప్పటికే రెండు కేసులను విజయవంతంగా ఛేదించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఇక ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కిన హిట్ 3 మే1 న థియేటర్లలోకి రానుంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు విశాఖలో విడుదలైన హిట్ – 3 ట్రైలర్ నాని మేకోవర్ ను స్పష్టంగా చూపించింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా నాని తన వైలెన్స్ పర్ఫార్మెన్స్ తో హిట్ – 3 ట్రైలర్ ను పూర్తిగా రక్తపాతంగా మార్చారు.

ADVERTISEMENT

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీ కి హిట్ ఫార్ములా గా మారిన బ్లడ్ బాత్ కాన్సెప్ట్ నాని కూడా తాకిందా అన్నట్టుగా ట్రైలర్ చివరిలో నాని పూర్తిగా రక్తంతో తడిచిపోయారు. విశ్వక్ సేన్ హిట్, అడవి శేషు హిట్ -2 ప్రేక్షకుల అటెంషన్ ను తన వైపు తిప్పుకోగలిగితే నాని హిట్ -3 ట్రైలర్ తోనే సినిమాలోని వైలెన్స్ ఎలా ఉండబోతుందో అనేది చూపించింది.

ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న నాని,.. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేకుంటే భూమి కింద 6 ఫీట్ గోతిలో ఉండాలి అంటూ చెప్పిన డైలాగ్ నాని పాత్రలోని ఆవేశాన్ని చూపించింది. అలాగే ఈ హిట్- 3 కేసు 9 నెలల చిన్నారి మిస్సింగ్ తో మొదలై మరెన్ని మలుపులు తిరగనుందో అన్నట్టుగా ట్రైలర్ కట్ కనిపిస్తుంది.

శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కెజిఎఫ్ శ్రీనిధి శెట్టి నానితో జత కట్టగా, రావు రమేష్, బ్రహ్మాజీ, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలలో నటించారు.ఇప్పటి వరకు సాఫ్ట్ మ్యూజిక్ తో అలరించిన మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అయితే ట్రయిలర్ లో వచ్చిన బీజీఎమ్ పూర్తిగా ఆకట్టుకుందనే చెప్పాలి.

గత నెల 14 న వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానేర్ లో వచ్చిన కోర్ట్ మూవీ నిర్మాతగా నానికి కాసుల వర్షాన్ని కురిపించడం తో పాటుగా మంచి అభిరుచి గల నిర్మాతగా నానికి ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఇక ఇపుడు ఇదే బ్యానేర్ తో వస్తున్న నాని హిట్ – 3 ప్రేక్షకులను కేసులో ఏ మేరకు ఇన్వాల్వ్ చేయగలుగుతుందో చూడాలి.

అయితే ఈ హిట్ సిరీస్ కొనసాగింపుగా హిట్ – 4 లో తమిళ సూపర్ స్టార్ కార్తీ నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. మరి ఈ హిట్ సిరీస్ రానున్న రోజులలో ఇంకెన్ని విధ్వంశకర కేసుల ఛేదనతో ప్రేక్ల్షకుల ముందుకొస్తుందో, ఇంకెంత వైలెన్స్ ను పరిచయం చేస్తుందో చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు.. ఊహించిందే

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు…

6 minutes ago

Egilivaranga From Bhogi: A Soulful, Lively Folk Song

Sharwa is coming up with the rural period action drama Bhogi. Directed by Sampath Nandi…

23 minutes ago