
విజయ్ దేవరకొండ తాజాగా పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు బ్యానర్ లో అఫీషియల్ గా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. గీత గోవిందం కాంబినేషన్ కాబట్టి సహజంగానే మంచి అంచనాలు ఉంటాయి. అయితే పరశురామ్ ముందు నాగ చైతన్యతో చేయాల్సింది. కానీ స్క్రిప్ట్ తో అక్కినేని హీరోని మెప్పించలేకపోయాడు. నిజానికి సర్కారు వారి పాట కనక రిలీజ్ కు ముందు ఊరించిన రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యుంటే టయర్ 1 స్టార్లే పిలిచి మరీ చేసేవాళ్ళు. యావరేజ్ కంటెంట్ తో ఏదో మహేష్ బాబు నెట్టుకొచ్చాడు కాబట్టి సరిపోయింది
ఇప్పుడు రౌడీ హీరోని పట్టేసుకున్నాడు. గీత గోవిందం 2 అనే ప్రచారం ఉంది కానీ ఇది వేరే ఫ్రెష్ కథ. సరే జానర్ ఏంటి, బ్యాక్ డ్రాప్ ఎలా ఉంటుంది అవన్నీ తర్వాత తెలిసే విషయాలు. దీని కన్నా ముందు గౌతమ్ తిన్ననూరికి ఎస్ చెప్పిన విజయ్ దేవరకొండ అతను కూడా రామ్ చరణ్ తో నో చెప్పించుకుని వచ్చిన సంగతి తెలియకేం కాదు. పైగా ఇప్పటిదాకా సాఫ్ట్ ఎమోషనల్ సబ్జెక్ట్స్ మాత్రమే డీల్ చేసిన గౌతమ్ పోలీస్ యాక్షన్ డ్రామాని ఎలా డీల్ చేస్తాడోననే అనుమానం లేకపోలేదు. సితార బ్యానర్ కాబట్టి ఎక్కువ ఆలోచించలేదేమో
లైగర్ గాయం ఎప్పుడు మానుతుందాని ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండకు ఖుషి హిట్ కావడం చాలా అవసరం. అదేమో సమంతా కోసం వాయిదా పడుతూనే ఉంది. తిరిగి వచ్చాక కూడా సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం ముంబై వెళ్ళింది కానీ ఇక్కడికి రాలేదు. సరే ఇవన్నీ పక్కనపెడితే డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఇలా వరసగా డిజాస్టర్ల రుచి చూసిన విజయ్ కు వీటిలో ఏ రెండు హిట్ అయినా మార్కెట్ వంద కోట్లు దాటిపోయేది. మరి వేరొకరు వద్దన్న వాటిని కోరిమరీ చేస్తున్న దేవరకొండ నిర్ణయాలు రైటో రాంగో ఇంకో ఏడాదిన్నరలో తేలిపోతుంది
The Supreme Court’s observations on children’s internet access raise a serious question: When laws and…
ఏపీలో మొదలైన స్థానిక ఎన్నికల నామినేషన్ కార్యక్రమాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి.…