
Julakanti targets Jagan over poll violence
ఏపీలో మొదలైన స్థానిక ఎన్నికల నామినేషన్ కార్యక్రమాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి. అయితే ఈ దాడులలో టీడీపీ, వైసీపీ ఇరు పార్టీల శ్రేణులు తప్పు నీదంటే నీదంటూ వాదించుకుంటున్నాయి.
ఈ క్రమంలో టీడీపీ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రమైన ఆరోపణలు చేసారు. స్థానిక ఎన్నికలలో పార్టీ ఓటమిని ముందుగానే ఉహించి జగన్ ఇతర రాష్ట్రాల నుంచి రౌడీలను దింపి, రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం సృష్టించేందుకు పథక రచన చేసారంటూ ధ్వజమెత్తారు.
జగన్ పంజాబ్, కర్ణాటక, తమిళనాడు నుంచి కిరాయి రౌడీలను దిగుమతి చేసుకుని ఏపీలో “పాన్ ఇండియా రౌడీయిజం” చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుండి రౌడీలను రప్పయించి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడం జగన్ కు పరిపాటిగా మారిపోయిందని,
సొంత వ్యక్తుల మీదే దారుణాలు చేయడం, దగ్గరుండి అల్లర్లను ప్రోత్సహించి వాటిని ఇతరుల నెత్తిన రుద్దడం వైసీపీ రాజకీయంలో భాగమంటూ తాజాగా సాక్షి పేపర్ వచ్చిన ‘నారసురా రక్త చరిత్ర’ కథనాన్నీ ఉదాహరణంగా చెప్పుకొచ్చారు.
గతంలో వివేకా దారుణ హత్య విషయంలోనూ నారసుర రక్త చరిత్ర అంటూ ప్రచారం చేసిన సాక్షి ఇప్పుడు కూడా అదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ సృష్టించిన విధ్వంసాన్ని నారాసుర రక్త చరిత్రగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందంటూ సాక్షి కథనాలను తప్పుబట్టారు.
పుంగనూరు లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సృష్టించిన భీభత్సం వెనుక, రాయచోటిలో వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి చేసిన అల్లర్ల వెనుక కూడా ఇతర రాష్ట్రాల వ్యక్తుల ప్రమేయం ఉందని, ఇక జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో సైతం వైసీపీ చేస్తున్న రౌడీయిజం తో పోలీసులు కాల్పులు జరిపే పరిస్థితి ఏర్పడిందంటూ వైసీపీ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు.
Political tensions are rising in Andhra Pradesh as clashes continue during the municipal election nomination…
SS Rajamouli's Varanasi is one of the most ambitious projects in Indian cinema, with Mahesh…