
కరోనా, లాక్ డవున్ల తర్వాత భారత్‌పై అంత తీవ్ర ప్రభావం చూపింది ఎవరంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అని చెప్పక తప్పదు.
ఆయన పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత్‌పై దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టిన తర్వాత భారత్‌తో సహా యావత్ ప్రపంచదేశాలను ట్రంప్ అతలాకుతలం చేశారనే సంగతి అందరికీ తెలుసు. ఈ రెండేళ్ళలో ట్రంప్ పుణ్యమాని భారత్ లక్షల కోట్లు నష్టపోయింది.
ఒకసారి ‘భారత్ ఆర్ధిక వ్యవస్థ చచ్చిపోయింది’ అని ట్రంప్ అవహేళన చేస్తారు. అదే నోటితో జీ7 సదస్సులో ‘భారత్ ఒక గొప్ప అంతర్జాతీయ శక్తి’ అని మెచ్చుకున్నారు.
“భారత్ మా మిత్రదేశం… ‘ప్రధాని మోడీ నా ఆప్తమిత్రుడు” అంటూనే భారత్‌కు తీరని నష్టం కలిగిస్తున్న ట్రంప్, “నేను ఈ కుర్చీలో కూర్చునంత కాలం భారత్‌కు ఢోకా ఉండదని” ట్రంప్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
అమెరికా దాడిలో భారత్‌కు చెందిన ముగ్గురు నావికులు మరణించిన విషయం ప్రధాని మోడీ ట్రంప్ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆయనలో ఎటువంటి బాధ, పశ్చాతాపం కనిపించలేదు. భారత్ పట్ల ట్రంప్ చులకన వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?కనుక ట్రంప్ ఆ కుర్చీలో ఉండగా భారత్‌కు ఎంతో కొంత నష్టమే తప్ప లాభం ఆశించడం దురాశే అవుతుంది.
ఈ రెండున్నరేళ్ళలో ట్రంప్ చేసిన ఒకే ఒక మంచి పని ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయడం. ఆయన యుద్ధాలు ఆపకపోయినా పర్వాలేదు కానీ మళ్ళీ కొత్తగా మరో దేశంతో యుద్ధం మొదలుపెట్టకుండా ఉంటే చాలు. అదే.. అయన భారత్‌కు, యావత్ ప్రపంచదేశాలకు చేయగల ఏకైక మహోపకారం.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…