పవన్ కి ఎంత ప్యాకేజీ ఇచ్చాడు జగన్.!

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్ర భవిష్యత్ మెరుగు పరచడానికా లేక భవిష్యత్ ని అంధకారం చేయడానికో అర్ధంకాని పరిస్థితులలో ఉన్నారు రాష్ట్ర ప్రజానీకం.

నాయకులకు ప్రజల పట్ల బాధ్యత లేదు, మంత్రులకు శాఖల పట్ల అవగాహన లేదు.,అధినేతకు పాలన పట్ల ఆసక్తి లేదు..! విపక్షాల మీద విరుచుపడడమే వారి శాఖ పని అన్న చందంగా వ్యవహరిస్తున్నారు సదరు మంత్రులు.

ADVERTISEMENT

రాష్ట్ర పర్యటక శాఖా మంత్రి రోజా కు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా లోను., ఇటు సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్లు పేలుస్తున్నారు జనసేన నేతలు. చంద్రబాబు అరెస్టును ఖండించి., ఆ అరెస్టుకు నిరసనగా టీడీపీ నిర్వహిస్తున్న బందుకు జనసేన అధినేత పవన్ తన పార్టీ మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలి అంటూ జనసైనికులకు పిలుపునిచ్చారు పవన్.

రెండు పార్టీల మూకుమ్మడి నిరసనలతో కంగుతిన్న వైసీపీ యదావిధిగా మీడియా ముందుకి వచ్చి తమ నోటికి పనిచెప్పారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన ఒక సన్నాసి కోసం ఒక దరిద్రుడు మద్దతు పలికాడు అంటూ తన కంపు నోరు తెరిచారు రోజా. బాబు దగ్గర ప్యాకేజీ కోసమే ఈ డ్రామాలు సొంత పుత్రుడి కంటే దత్తపుత్రుడి హడావిడి ఎక్కువైంది అంటూ రెచ్చిపోయారు. ఇప్పుడైనా ప్రజలు ఈ ప్యాకేజీ స్టార్ ను గమనించాలి అంటూ అటు చంద్రబాబు పైనా ఇటు పవన్ పైనా హద్దులు దాటి మాట్లాడారు.

ఈ విమర్శల మీద స్పందిస్తున్న జనసేన నేతలు ఒక్క కేసులో రిమాండ్ కు వెళ్లిన బాబుకి మద్దతు పలికితేనే ప్యాకేజీ అంటూ వాగుతున్న నువ్వు 32 కేసులలో A1 ముద్దాయిగా ఉండి బెయిల్ మీద తిరుగుతున్న జగన్ మోహన్ రెడ్డిని సమర్దిస్తున్నందుకు జగన్ మీఅందరికి ఎంత ప్యాకేజీ ఇస్తున్నారో ముందు చెప్పాలి అంటూ రోజా పై విరుచుకుపడుతున్నారు.

చంద్రబాబూ మీద పెట్టిన కేసులు నిజమైతే జగన్ మీద ఉన్న కేసులు వాస్తవమే అని ఒప్పుకోండి. అలా చూసినా చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొని రిమాండ్ కు మాత్రమే వెళ్లారు. కానీ జగన్ 16 నెలలు జైల్లో గడిపొచ్చారు. మరి దాని సంగతేంటి అంటూ నిలదీస్తున్నారు జనసేన నేతలు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పై జరిగిన కోడికత్తి దాడికి గాను పవన్ మీ అధినేతకు మద్దతు పలికారు. అయితే అది స్క్రిప్టులో భాగమే అన్న సంగతి వేరే విషయం అనుకోండి. మరి అప్పుడు జగన్ ఎంత ప్యాకేజీ ఇచ్చాడో పవన్ కి చెప్పాలంటూ అంటూ రోజా నోటికి తాళం వేశారు.

అధినేత కింద అన్ని కేసులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తనతో పాటు జగన్ కు కూడా చిక్కులు తెస్తున్నారు వైసీపీ నేతలు. వారి అత్యుత్సహం వలన పోయేది జగన్ పరువే అనేది ఎప్పటికి గుర్తిస్తారో ఈ వైసీపీ మంత్రులు., నాయకులు.

అవినీతి గురించి వైసీపీ ప్రభుత్వం కానీ.., ఆపార్టీ నేతలు కానీ చెప్పే నీతి ప్రవచనాలు వింటుంటే మాత్రం యావత్ రాష్ట్రానికి “దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది” అనే పాతకాలం సామెత ఒకటి మరుపుకు రాక మానదు సుమీ.!

Share
Published by

Recent Posts

DSC Jobs Vs YSRCP: Clash Heats Up In AP!

It appears that YSR Congress is completely against the common public, securing reasonable jobs through…

32 minutes ago

January 12 Vidudala: Krithi Shetty in Traditional Attire

Victory Venkatesh, Nandamuri Kalyanram, Keerthy Suresh and Krithi Shetty are starring in leading roles under…

37 minutes ago