Telugu

నాటి స్నేహమే నేటి శత్రువయ్యిందా.?

రాజకీయాలలో ఎప్పుడు ఏమవుతుంది.? ఏ నిర్ణయం ఎవరిని ఏ దశకు తీసుకెళ్తుంది అని ఉహించి చెప్పడం చాల అవివేకమే అవుతుంది. అయితే 2019 లో వైసీపీ – బిఆర్ఎస్ ల మధ్య ఏర్పడిన స్నేహ బంధం అప్పటికి ఇరు పార్టీలకు రాజకీయ లబ్దిని కలిగించిన మాట ముమ్మాటికీ వాస్తవమే.

అయితే కాలానుగుణంగా ఆ ఇరు పార్టీల నాటి స్నేహమే నేడు గులాబీ కారుకి వైసీపీ ఫ్యాన్ కి శత్రువవుతుందని నాడు ఎవ్వరు ఊహించలేదు. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఏపీ ప్రజల ఆగ్రహానికి కారణాలుగా మారాయి.

ADVERTISEMENT

వాటిలో హైద్రాబాద్ లో ఉన్న ఇరు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులను జగన్ ఒకే ఒక్క సంతకంతో కేసీఆర్ ప్రభుత్వానికి దారాదత్తం చేయడం, ప్రతిపక్ష నేతగా ఇచ్చిన మాటను జగన్ ముఖ్యమంత్రిగా తప్పి అమరావతిని కాదని మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్ ని పాతాళానికి తొక్కడం,

ఇక బాబు అరెస్టుతో టీడీపీ కి సమూలంగా రాజకీయ సమాధి కట్టాలని భావించడం. అయితే ఈ మూడు నిర్ణయాల వెనుక జగన్ ఆవేశం, అత్యుత్సహం తో పాటుగా కేసీఆర్ అత్యాశ, అహంభావం కూడా ఉన్నాయని ఏపీ ప్రజలతో పాటుగా తెలంగాణ సమాజం కూడా బలంగా నమ్మింది. ఆ నమ్మకాన్నే తమ ఓట్ల రూపంలో ఇరు రాష్ట్రాల ప్రజలు 2023, 24 ఎన్నికలలో బలపరిచారు.

వాటి ఫలితమే తెలంగాణలో బిఆర్ఎస్ ప్రతిపక్షానికి, ఏపీలో వైసీపీ ఆ హోదా కూడా లేకుండా ఓటమిని మూటకట్టుకున్నాయి. అయితే నాటి వీరి స్నేహమే నేడు ఈ రెండు పార్టీల పాలిట శాపంగా మారింది. ఈ ఇద్దరి స్నేహం ఇరు రాష్ట్రాల అభివృద్ధిని కాకుండా ఇరు పార్టీల రాజకీయ స్వార్ధాన్ని కాంక్షించాయి.

అలాగే ఈ రెండు పార్టీల ఆలోచన తమ ఎదుగుదల కోసం కాకుండా మరో పార్టీ పతనం కోసం పనిచేసాయి. నాటి ముఖ్యమంత్రులుగా జగన్, కేసీఆర్ తమ తమ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా తమ ఉమ్మడి శత్రువు వినాశనం కోసం తమ అధికారాన్ని వినియోగించారు.

బాబు అరెస్టుతో ఏపీలో వైసీపీ నేతలు సంబరాలు జరుపుకుంటే, తెలంగాణలో బిఆర్ఎస్ నేతలు ప్రజల పై ఆంక్షలు విధించారు. అలాగే జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం పరోక్షంగా హైద్రాబాద్ అభివృద్ధి విస్తరణకు మేలు చేకూర్చిందని, తద్వారా అది కేటీఆర్ రాజకీయ ఎదుగుదలకు తోడ్పాటునిచ్చినట్టయ్యిందనే భావన ఏపీ యువతలో బలంగా నాటుకుపోయింది.

జగన్ తన అధికారంతో ఏపీ అభివృద్ధికి బదులు బిఆర్ఎస్ అభివృద్ధికి తోడ్పడుతున్నారని, 2019 ఎన్నికలలో కేసీఆర్ జగన్ కు చేసిన తెరచాటు సాయానికి వైసీపీ ఈరకంగా కృతజ్ఞత తీర్చుకుంటుందా అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమికై సంకటితం అయ్యారు.

అలాగే అటు తెలంగాణ విషయానికొస్తే పదేళ్ల అధికారం కేసీఆర్ కుటుంబానికి అంతు లేని అహంకారాన్ని తెచ్చిపెట్టిందని, కేసీఆర్ ఇక్కడి ప్రజలు కోసం కాకుండా అక్కడి నాయకుల రిటర్న్ గిఫ్ట్ ల కోసం పని చేస్తున్నారనే భావన తెలంగాణ ఓటర్లను కాంగ్రెస్ హస్తం పట్టేలా చేసాయి. వాటి ఫలితమే ఏపీలో కూటమి తెలంగాణలో కాంగ్రెస్…!

Share
Published by

Recent Posts

After 3 Years, NTR Makes a Surprise Call

A phone call after three years has suddenly got the industry curious. Writer Kona Venkat…

8 minutes ago

విజయసాయి పార్టీ ప్రమోషన్స్ బాగానే ఉన్నాయి.. ఎలా ఆడుతుందో?

సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత రిలీజ్‌ చేసే వరకు పాటలు, టీజర్‌, ట్రైలర్‌, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు, ఇంటర్వ్యూలు అంటూ వీలైనంతగా…

9 minutes ago