ఏపీకి వసంతకాలం మొదలయినట్టేనా.?

ఇన్నాళ్లు పరిశ్రమలు లేక, పెట్టుబడులు రాక మోడుబారిన ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు వసంతకాలం మొదలైనట్టు కనిపిస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణాల నుంచి రాష్ట్రంలో పరిశ్రమల రాక వరకు ఆంధ్రప్రదేశ్ మరోసారి అభివృద్ధి చిగురు తొడుక్కుంటుంది.

నన్ను చూసి పెట్టుబడులు పెట్టండి, మా ప్రభుత్వాన్ని నమ్మి పరిశ్రమలు స్థాపించండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, తన నాలుగు పర్యాయాల ముఖ్యమంత్రి పాలన ను పెట్టుబడిగా పెట్టి రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారు బాబు.

ADVERTISEMENT

అయితే అమరావతి నవ నిర్మాణాలతో పాటుగా, విశాఖ, అనకాపల్లి, తిరుపతి, శ్రీసిటీ, కడప, కర్నూల్, శ్రీకాకుళం…ఇలా రాష్ట్రంలోని నలుమూలల పరిశ్రమలను ఆహ్వానిస్తూ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ చంద్రబాబు చేస్తున్న ఈ మహా యజ్ఞానికి వైసీపీ రాబంధులా అడ్డుపడుతుంది.

ఇందులో భాగంగా వైసీపీ రాజధాని అమరావతి మీద విషం చిమ్మడంతో పాటుగా, రాష్ట్ర గౌరవ మర్యాదల మీద బురద రాజకీయం చేస్తూ, నరుకుతాం, గుడ్డలూడదీస్తాం, ఒక్కొక్కడిని వేటాడుతాం, వెంటాడుతాం అంటూ బెదిరింపు చర్యలతో ఎగబడుతుంది.

వైసీపీ 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంత ఘోర ఓటమిని మూటకట్టుకున్నప్పటికీ ఎందుకు ఇంతలా బరితెగిస్తుంది.? ఎందుకు అంతలా పార్టీ శ్రేణులను రెచ్చకొడుతుంది.? కూటమి ప్రభుత్వ రాకతో రాష్ట్రంలో ఏర్పడిన ప్రశాంత వాతావరణాన్ని వైసీపీ తట్టుకోలేకపోతుందా.?

అందుకే ఇంతలా దిగజారిన రాజకీయానికి వైసీపీ దిగజారిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వాన్ని చూసి, బాబు విజనరీ ని నమ్మి పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం వైపు చూస్తున్న పారిశ్రామిక వేత్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు మీద ఉంది.

బాబు తన నాయకత్వ లక్షణాలతో రాష్ట్రానికి పరిశ్రమలైతే తెగలరు కానీ వాటిని రాష్ట్రంలో కొన్నేళ్ల పాటు సజావుగా కొనసాగగలిగేలా చేసే బాధ్యత, హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతిలోనే ఉంటుంది.

2024 ఎన్నికలలో వైసీపీ విధ్వంసాలకు చరమ గీతం పాడిన ఏపీ పౌరులు ఆ అరాచకాన్ని మరికొన్నేళ్ల పాటు అధికార పీఠానికి దూరం చెయ్యగలిగితే ఏపీ దేశంలోనే మరో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తానూ నిలబడడంతో పాటు దేశాన్ని నిలబెట్టగలుగుతుంది.

మళ్ళీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే అన్న ప్రశ్నే సామాన్య రాజధాని రైతు నుంచి మొదలుకుని బడా పారిశ్రామిక వేత్త వరకు వెంటాడి వేధిస్తుంది. వారి భయాలకు, కూటమి ప్రభుత్వ భరోసా తో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంపూర్ణ సహకారం కూడా తప్పనిసరి.

ప్రతి ఐదేళ్లకొకసారి ప్రభుత్వాలను మార్చుకుంటూ పొతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదలుకుని సామజిక అంశాల వరకు రాష్ట్రం పురోగాభివృద్ధిని సాధించలేదు. ఇప్పటికే ఏపీ ప్రయోగాల పేరుతో వెంటిలేటర్ మీదకు వెళ్ళింది. మరోసారి రాజకీయ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్ మానసికంగా, ఆర్థికంగా ఏ మాత్రం సిద్ధంగా లేదు అనేది ముమ్మాటికీ వాస్తవం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

J.D. Vance Pauses PERM: Lawyers Question Gov Data

J.D. Vance has targeted multiple companies in his largescale immigration crackdown. Microsoft, TCS, Cognizant, and…

36 minutes ago

From Flowers To Stones: Young Director’s OTT Journey!

The Telugu OTT space witnessed one of the better contents in the form of 90s…

1 hour ago