
నిన్నటి నుండి సోషల్ మీడియా మొత్తం హైదరాబాద్ కి ఐమాక్స్ వస్తుంది అనే వార్త హల్ చల్ చేస్తోంది. ఏషియన్ సంస్థ హైదరాబాద్ లో సుదర్శన్ థియేటర్ దగ్గర రాబోతున్న మల్టీప్లెక్స్ లో ఐమాక్స్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈమేరకు ఐమాక్స్ సంస్థతో అగ్రిమెంట్ కూడా పూర్తయింది. వారణాసి రిలీజ్ టైమ్ కి ఐమాక్స్ సిద్ధమవుతుంది అని క్లారిటీ రావడంతో.. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ అంతా ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
అయితే.. హైదరాబాద్ లో ఐమాక్స్ వస్తున్న మాట నిజమే అయినప్పటికీ, అందులో చిన్న మెలిక ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ అనుకుంటున్నట్లు ఇది 1.43:1 రేషియో స్క్రీన్ GT ఐమాక్స్ కాదు, 1.90:1 కమర్షియల్ లేజర్ ఫార్మాట్ అని సమాచారం. వారణాసి టీజర్ లాంచ్ ఈవెంట్లో రాజమౌళి ప్రాజెక్ట్ చేసి చూపించింది ఒరిజినల్ ఐమాక్స్ ఫార్మాట్, ఆ ఫార్మాట్ లో సినిమా ప్లే చేయాలంటే డ్యూయల్ రీల్ ప్రొజెక్టర్ అవసరం, అవి ఇప్పుడు మాన్యుఫాక్చర్ కూడా చేయట్లేదు. ఇప్పుడొస్తున్న డ్యూయల్ లేజర్ ప్రొజెక్టర్ కొనాలన్నా కోట్ల రూపాయల పెట్టుబడి. అందుకే ఏషియన్ సంస్థ కాస్త ఫీజబుల్ గా ఉండే కమర్షియల్ లేజర్ ఫార్మాట్ ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఏషియన్ సంస్థ కూడా ఐమాక్స్ వస్తున్నట్లు ప్రకటించింది కానీ.. దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది రిలీజ్ చేయలేదు. దాంతో మూవీ లవర్స్ లో ఆ స్క్రీన్ సైజ్ ఏమై ఉంటుందా? అనే కన్ఫ్యూజన్ తలెత్తింది. పైన పేర్కొన్నట్లు కమర్షియల్ లేజర్ వచ్చినా పర్లేదు కానీ.. ఇంకో ఫార్మాట్ ఉంటుంది, పేరుకే ఐమాక్స్ కానీ బ్రైట్ నెస్ కానీ, స్క్రీన్ సైజ్ కానీ చాలా తక్కువ, దాన్ని లైమాక్స్ అంటారు. ఐమాక్స్ పేరిట అది హైదరాబాద్ కి అంటగట్టకుంటే చాలు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ తోపాటుగా.. షామీర్ పెట్ లోనూ ఐమాక్స్ స్క్రీన్ రాబోతోందని సమాచారం అందుతోంది. అందులో వాస్తవమెంత అనేది తెలియదు కానీ.. హైదరాబాద్ కి ఇప్పుడు రెండు ఐమాక్స్ స్క్రీన్స్ అనేది సినిమా లవర్స్ కి సంతోషాన్ని ఇస్తుంది. ఈలోపు ఏషియన్ సంస్థ ఆ స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ చేస్తే, టెన్షన్ తగ్గి, సదరు ఫార్మాట్ లో “వారణాసి” సినిమా చూడడం కోసం ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తారు ప్రేక్షకులు.
Chiranjeevi’s Sankranthi 2027 plans have taken a clear turn. Kaaka has officially locked January 13,…
An old video of Ranbir Kapoor refusing Ganesh prasad has resurfaced, and it has now…