
నాడు కుంతీదేవి అవివాహితగా ఉన్నప్పుడు లోకానికి భయపడి సూర్యుడి వరంతో జన్మించిన పసిబిడ్డని ఓ బుట్టలో ఉంచి నదిలో వదిలేస్తుంది. అతనే కర్ణుడు. ఈ పురాణగాథ అందరికీ తెలిసిందే.
నాటి నుంచి నేడు కలియుగం వరకు ఎంతో మంది కుంతీదేవిలు లోకానికి భయపడి పసికందులను చెత్తకుప్పలలో లేదా కాలువలలో పడేస్తూనే ఉన్నారు.
హైదరాబాద్‌లో ఇటువంటి ఘటన కలచివేసింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓ మహిళా హాస్టల్లో ఉంటున్న ఓ యువతి వాష్‌రూమ్‌లో బిడ్డకు జన్మనివ్వగా, లోకానికి భయపడి కిటికీలో నుంచి ఆ పసికందుని బయటకు విసిరేసింది. దాంతో ఆ పసికందు ప్రాణాలు కోల్పోయింది. తర్వాత ఈ విషయం హాస్టల్ వార్డెన్‌కు తెలియడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకొని నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించారు. ఆమె ఎవరి వల్ల గర్భం దాల్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు.
లోకానికి భయపడి, కుటుంబ పరువు, సామాజిక ఒత్తిడి, సంబంధాలపై అనిశ్చితి వంటి అనేక కారణాలు యువతులు తమ సమస్య గురించి ఎవరికీ చెప్పుకోలేని ఒంటరితనంలోకి నెట్టేస్తున్నాయి. అవే కారణాల వల్ల వారు తీవ్ర మానసిక క్షోభ అనుభవించి చివరికి ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నాయి.
ఏది ఏమైనప్పటికీ ఒక పురుషుడు, మహిళ చేసిన తప్పుకి అమాయకమైన పసిప్రాణాలు బలవుతుండటం చాలా బాధాకరం. నాడు జరిగిన ఇటువంటి ప్రతీ పరిణామం లోక కళ్యాణార్థం జరిగినట్లు తదనంతర సమయంలో అర్థమయ్యేది. కానీ ఈ కలియుగంలో పురుషుల చేతిలో మహిళలు మోసపోవడం లేదా వైవాహికేతర సంబంధాల వలన ఇటువంటి విషాదాలు జరుగుతున్నాయి.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…