
మొదటి రోజు సుమారు లక్షమంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రతి పావుగంటకో రైలు చొప్పున మొత్తం 18 రైళ్లు తిరుగుతాయి. మియాపూర్-నాగోలు 27.6 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 24 మెట్రో స్టేషన్లున్నాయి. ఇప్పటివరకు 12000 స్మార్ట్ కార్డులు అమ్ముడుపోయాయి. మరో వైపు మొదటి టిక్కెట్ కొన్న ప్రయాణికుడికి అధికారులు ఒక గిఫ్ట్ ఇచ్చారు.
నాగోల్ – మియాపూర్ మధ్య 30 కి.మీల దూరంలో 24 స్టేష్లన్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు కేవలం 42 నిమిషాల్లో నాగోల్ నుంచి మియాపూర్‌కు చేరుకోవచ్చు. మెట్రో టికెట్ కనిష్ట ధర రూ.10, గరిష్ట టికెట్ ధర రూ.60గా నిర్ణయించారు. నిజానికి మియాపూర్-నాగోలు మధ్య దూరం 30 కిలోమీటర్లే. కానీ, ఈ రెండు ‘స్టేషన్ల మధ్య ప్రయాణ దూరం’ 27.6 కిలోమీటర్లేనని కావున ఆమేరకే ప్రజల నుండి ఛార్జీలు వసూలు చేయనున్నట్లు సమాచారం.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…