Telugu

స్టాక్ మార్కెట్ గ్రాఫ్… బాలయ్య బాబు తోప్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ – కొణిదెల కొదమసింహం పవన్ కళ్యాణ్ ల కాంభినేషన్… ఊహకే ఎంత కిక్ ఇస్తుందో, తాము నటించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా కూడా అంతే కిక్ ని ఇస్తుందంటూ బుల్లితెర మాటల మాంత్రికుడు హైపర్ ఆది ప్రసంగించారు.

విశ్వక్ సేన్ నటించిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన బాలకృష్ణ ఎదురుగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి నందమూరి అభిమానుల మనసులు కొల్లగొట్టాడు ఆది.

ADVERTISEMENT

బాలయ్య బాబు ఉన్న చోట ‘జై బాలయ్య’ అని చెప్పి స్పీచ్ మొదలుపెట్టాలని అన్న ఆది, చాలా మంది బాలకృష్ణ ఎవరినో కొట్టారు, ఎవరినో తిట్టారు అని రాస్తుంటారు, కానీ బసవతారకం హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మంది బతుకులు నిలబెట్టారని, బాలయ్యతో పని చేసే వారికి భయం, బాధ్యత రెండూ ఉంటాయని చెప్పుకొచ్చారు.

స్టాక్ మార్కెట్ గ్రాఫ్ అయినా పెరగడం, తగ్గడం ఉంటుంది గానీ, బాలయ్య బాబు మార్కెట్ గ్రాఫ్ మాత్రం పెరగడం తప్ప తగ్గడం లేదని, సినిమాల్లో, ఓటీటీలలో, రాజకీయాల్లో, సేవ చేయడంలో, అనవసరంగా దూరిన వాడిని కొట్టడంలో అన్ స్టాపబుల్, అవసరం అని అడిగిన వాడికి పెట్టడంలో అన్ స్టాపబుల్ అంటూ తనదైన శైలిలో అనర్గళంగా ప్రసంగించారు ఆది.

పది నిముషాల్లో క్లోజ్ అయ్యే పబ్ ముందు జై బాలయ్య అనే స్లోగన్స్ వస్తే ఎంత కిక్ వస్తుందో… పద్దతిగా ఫోటో దిగాల్సినోడు ఫోన్ తెచ్చి ముఖాన పెట్టినప్పుడు అలా పక్కకు తడితే మీకెంత కిక్ వస్తుందో… మాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో… రేపొద్దున నందమూరి నటసింహం – కొణిదెల కొదమసింహం కలిసి అసెంబ్లీలో అడుగుపెడితే ఎంత కిక్ వస్తుందో….

మా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమా కూడా ప్రేక్షకులకు అంత కిక్ ని పంచుతుందని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. రత్న అనే 28 ఏళ్ళ కుర్రాడు ధియేటర్ లో చేయబోయే మాస్ జాతరని 31వ తేదీన ప్రేక్షకులు చూడబోతున్నారంటూ విశ్వక్ సేన్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తాన్ని తనదైన మార్క్ పంచ్ లు వేసి ముగించాడు ఆది.

‘జబర్దస్త్’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆది టాలెంట్ బుల్లితెర, సిల్వర్ స్క్రీన్ కే కాదు, ప్రజాక్షేత్రంలో ‘జనసేన’ ద్వారా కూడా ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయ్యాడు. గడిచిన రెండు నెలలుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి అందరికి తెలిసిందే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Forget Reels, Focus on Real Life: Suriya

Actor Suriya has a message for students who spend too much time making reels, focus…

28 minutes ago

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీట్ల కోసం పట్టుబడితే ఎలా?

స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన 40 శాతం సీట్లకు పట్టుబడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్…

32 minutes ago