Telugu

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీట్ల కోసం పట్టుబడితే ఎలా?

స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన 40 శాతం సీట్లకు పట్టుబడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై టీడీపి శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఓ పక్క సీట్ల విషయంలో చర్చలు జరుగుతుంటే బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నవారే ఈవిధంగా పోస్టులు పెట్టి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే మిత్ర పక్షాలను సంప్రదించకుండా ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించడం సబబేనా? అని జనసేన శ్రేణులు, మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ పక్క ఇలా యుద్ధాలు జరుగుతుండగా, టీడీపి-జనసేన సీట్ల పంచాయితీ ఎంతకీ తెగడం లేదు.

జనసేన 6 కార్పోరేషన్లు, 26 మున్సిపాలిటీలను కోరుతుండగా 4 లేదా 5 కార్పోరేషన్లు, కొన్ని మున్సిపల్ పదవులతో సర్దుకోమని టీడీపి హితవు పలుకుతున్నట్లు తెలుస్తోంది. నేడు సిఎం చంద్రబాబు నాయుడుతో ముఖాముఖి సమావేశంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

బుధవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ విజయవాడలో ప్రెస్‌మీట్‌ నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలనుకుంది. కానీ చివరి నిమిషంలో మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేసింది. మూడు పార్టీల మద్య సీట్ల పంచాయితీ తేలకపోవడంతో ప్రభుత్వం సూచన మేరకు వాయిదా వేసి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనప్పటికీ, ఇకపై సీట్ల సర్దుబాట్ల విషయంలో జనసేన పార్టీ త్యాగాలకు సిద్ధంగా లేదనే విషయం స్పష్టం చేసిందనే అనుకోవచ్చు. జనసేన డిమాండ్స్ అందుకు అది చేస్తున్న వాదనలు సహేతుకమే కావచ్చు.

కానీ ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో జనసేన చేసిన ప్రకటన చూసినప్పుడు దాని పరిస్థితి ఏమిటో అర్ధమవుతుంది.

కనుక రాష్ట్రంలో జనసేన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముందుగా పార్టీలో బలమైన నాయకులను తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టి ఉండి ఉంటే, నేడు టీడీపి కూడా దానికి ‘నో’ చెప్పలేక పోయేది.

కానీ సీట్ల కోసం ఇంత ఒత్తిడి చేసిన తర్వాత ఈసారి కూడా టీడీపికి చెందిన బలమైన నేతలను తమ అభ్యర్ధులుగా నిలబెట్టుకుంటే అది జనసేనకు ఏమాత్రం గర్వకారణం కాబోదు.

ఇక సీట్ల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధాలు, రెండు పార్టీలలో నెలకొన్న ఈ ఒత్తిళ్ళు చూస్తున్నప్పుడు, వచ్చే ఎన్నికలలో జనసేన కూటమిలో కొనసాగుతుందా లేదా? అనే సందేహాలు అప్పుడే వ్యక్తం అవుతున్నాయి.

వైసీపీ కోరుకున్నది కూడా ఇదేగా? కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్లు వైసీపీ చేతికి మట్టి అంటకుండా కూటమి పార్టీలే కత్తులు దూసుకుంటే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?అని ఆలోచిస్తే మంచిది. కానీ ఆవేశం ఆలోచించనీయడం లేదు. కనుక అందరూ కలిసి వైసీపీని గెలిపించుకుంటారేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mrunal Thakur Says No, But What Is She Waiting For?

Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…

34 minutes ago

Rohit Back as MI Cap? Truth Behind Big Rumours

Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…

1 hour ago