
సిరీస్ ప్రారంభం నాటికి భారత్ 121 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్ 109 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే తొలి టెస్ట్ లో ఓటమి పాలు కావడం, రెండవ టెస్ట్ రెండు రోజుల వరకు పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో, నెంబర్ 1 స్పాట్ మారిపోతుందని అంతా భావించారు. కానీ తాజా విజయంతో దాదాపుగా స్పష్టత వచ్చేసినట్లే. ఏప్రిల్ 1 నాటికి టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న జట్టును వరల్డ్ నెంబర్ వన్ టెస్టు జట్టుగా ఐసీసీ ప్రకటిస్తుంది.
నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నందుకు గాను ఐసీసీ సదరు జట్టుకు 6 కోట్ల 70 లక్షల రూపాయల నజరానా అందజేస్తుంది. ఇప్పుడు ఈ భారీ నజరానా భారత జట్టుకు అందనుంది. ఇప్పటికే ఒక టెస్టులో నెగ్గి, ఒక టెస్టులో ఓడడం ద్వారా ఈ రెండు జట్ల పాయింట్ల మధ్య తేడాలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ నెలాఖరుకి ఈ పాయింట్లలో పెద్ద తేడా వచ్చే అవకాశం లేదు. దీంతో ఐసీసీ వరల్డ్ నెంబర్ వన్ హోదాతో పాటు భారీ నజరానా భారత జట్టు సొంతం కానుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…