Telugu

ఐపీఎల్ కంచికి, వరల్డ్ కప్ ఇంటికి..!

ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూసే టీ-20 వరల్డ్ కప్ జూన్ 01 న డల్లాస్ వేదికగా ప్రారంభమయ్యింది. అయితే, గత వారంలో ఐపీఎల్ ఫైనల్స్ ముగియడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నక్రికెట్ అభిమానులకు మళ్ళీ టీ – 20 వరల్డ్ కప్ తో ఉత్సాహపరచడానికి భారత క్రికెటర్స్ సిద్ధమయ్యారు. ఇప్పటికే భారత జట్టు ఆటగాళ్లు బంగ్లాదేశ్ తో ఒక వామ్ అప్ మ్యాచ్ ను ముగించుకుని, ఆత్మ విశ్వాసంతో ఉన్నారు.

ADVERTISEMENT

ఐపీఎల్ లో దారుణంగా ఫెయిల్ అయిన ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్య, ఇటీవలే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతున్నట్టు తన బాట్ తో నే మాట్లాడారు. టీం కు అత్యవసరమైన సమయం లో తన ఫినిషింగ్ స్కిల్స్ ను మరొకసారి వామ్ అప్ మ్యాచ్ వేదికగా చూపించారు పాండ్య. అయితే, ఈ వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయనున్నట్లు పలు మీడియా సంస్థలు వెల్లడిస్తున్నారు.

ఒక వేళ అదే నిజమైతే, ఆటగాళ్ల వరుస క్రమంలో మార్పులు తప్పనిసరి అవుతాయి. ఏది
ఏమైనప్పటికి, టీం కలసికట్టుగా ఆడితే, భారత జట్టు కు ఉన్న విభిన్నత మరో జట్టు దగ్గర కనపడుటలదు.ఇక జూన్ 09 న న్యూ యార్క్ వేదికగా జరిగే ఇండియా VS పాకిస్తాన్ మ్యాచ్ పై నే అందరి ద్రుష్టి. మొత్తం 20 జాతీయ జట్టులు పాల్గొంటున్న ఈ టీ-20 వరల్డ్ కప్ ను 4 గ్రూప్స్ గా విభజించి, ఒక్కో గ్రూప్ లో ఐదేసి జట్టులు ఉండేటట్టు ఐసిసి యాజమాన్యం ఈ గ్రూప్స్ పద్ధతిని అమలుచేసారు. ఇండియా గ్రూప్ లో పాకిస్తాన్ తో పాటు కెనడా, ఐర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ భాగమైయున్నాయి.

భారత జట్టు జూన్ 05 వ తేదీన ఐర్లాండ్ తో తమ మొదటి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం గా ఉన్నారు అని టీం స్టాఫ్ తెలియజేసారు. వారు కేవలం కంబినేషన్స్ పై నే తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొన్నటి వరుకు ఐపీఎల్ లో తమ జట్టే గొప్ప అని ఫ్యాన్ వార్స్ చేసిన యువతే, నేడు మళ్ళీ జాతీయ జట్టుకు సమైక్యంగా తమ మద్దతు అందజేస్తూ, జట్టు ఆటగాళ్లకు ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నారు. ఇక ఐపీఎల్ ప్రస్తావన ముగిసి, వరల్డ్ కప్ ప్రస్తావన ప్రారంభమయ్యింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Daily Hearing At CBI Court, But Can Jagan Stay Out?

It has been more than dedicate since the CBI and the enforcement directorate have failed,…

3 minutes ago

వివేకా హత్య కేసులో సీబీఐ కంటే ఈడీ స్పీడ్‌!

“వివేకా హత్య కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఆ ఆరోపణలతో నేను చాలా ఆవేదన అనుభవిస్తున్నాను. నేను ఏ…

8 minutes ago