Telugu

15 సెకన్ల సమయం… వరల్డ్ కప్ చేజార్చింది..!

విజయానికి కావాల్సిన పరుగులు 229 పరుగులు… 42.4 ఓవర్లు ముగిసే సమయానికి 191 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అంటే విజయానికి 44 బంతుల్లో మరో 38 పరుగులు కావాల్సి ఉండగా, చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఈ దశలో క్రీజులో ఉన్న ఓపెనర్ రౌత్ (86) పరుగులు చేసి ఆలౌట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా మరోవైపు తిరిగింది. ఆ తర్వాత ఒత్తిడిని తట్టుకోలేని టీమిండియా 219 పరుగులకు ఆలౌటై, ఇంగ్లాండ్ కు ప్రపంచ కప్ ను అందించింది.

తన ఎల్బీడబ్ల్యూ నిర్ణయాన్ని రిఫర్ చేయడానికి ఉన్న 15 సెకన్ల సమయాన్ని మరో ఎండ్ లో ఉన్న కృష్ణమూర్తితో చర్చిస్తూ రూత్ వృధా చేయడంతో, ఆ తర్వాత ఎంపైర్ ను కాల్ చేసినప్పటికీ దానిని తిరస్కరించాడు. బహుశా ఈ నిర్ణయం రౌత్ త్వరగా వెల్లడించినట్లయితే ఫలితం మరోలా ఉండేదేమో! ఎందుకంటే ఆ బంతి లెగ్ సైడ్ కు వెళ్తుందన్న విషయం రిప్లైలో స్పష్టంగా కనపడింది. ఇక ఆ తర్వాత నుండి ఇంగ్లాండ్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగి వరుసగా టీమిండియా వికెట్లను నేలకూల్చింది.

ADVERTISEMENT

ముఖ్యంగా అన్య శ్రుబ్సోలె టైల్ ఎండర్స్ ను ఏ మాత్రం క్రీజులో నిలవనివ్వకుండా పెవిలియన్ కు పంపింది. దీనికి తోడు ఒత్తిడిని అధిగమించలేక స్వయంకృతాపరాధంగా రనౌట్ కావడం భారత్ కొంపముంచింది. చివరికి 8 బంతులు మిగిలి ఉండగానే 9 పరుగులు చేయాల్సి ఉండగా, ఆలౌట్ అయ్యి తీవ్ర నిరుత్సాహపడేలా చేసింది. అయితే పోరాటపటిమ పట్ల అందరూ ‘జోహార్లు’ పలుకుతున్నారు. ఒకానొక దశలో కేవలం 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఆ తర్వాత మ్యాచ్ గెలిచినంత పని చేసింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Irumudi2 Soon? Is Ram Charan Really Joining the Sequel?

Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…

22 seconds ago

Toxic: Yash Not Even Sparing X Users? More Negativity

A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…

60 minutes ago