
ఐఐఎం సెకండ్ ఇయర్ విద్యార్థులకు మేనేజ్ మెంట్ విభాగంలో ప్రత్యేక అంశంగా బాహుబలి ఘనవిజయాన్ని చేర్చాలని నిర్ణయించారు. దీంతో ఈ అంశంపై విద్యార్థులు లోతైన అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. నాలుగు నెలల్లో ఈ స్టడీ పూర్తి కానుందని ఐఐఎం వర్గాలు వెల్లడించాయి. ఇదో గొప్ప చిత్రమని, కళ, సాంకేతిక పరిజ్ఞానాలకు వ్యాపారం కూడా తోడైందని ఈ సందర్భంగా భరతన్ కందస్వామి వ్యాఖ్యానించారు.
సృజనాత్మకంగా, కళాత్మకంగా ఉండే సినిమాలు మంచి కలెక్షన్లు రాబట్టలేకపోవచ్చని, కొన్నిసార్లు టెక్నాలజీని వాడినా ఉపయోగం ఉండదని గుర్తు చేసిన ఆయన, కథ బాగున్నంత మాత్రాన సినిమా హిట్ కావాలని లేదని, కథ మోస్తరుగా ఉన్న చిత్రాలూ హిట్ అయిన సందర్భాలుంటాయని చెప్పారు. కానీ బాహుబలి విషయంలో అన్నీ కుదిరాయని, అందుకే అంత విజయాన్ని నమోదు చేసిందని తెలిపారు.
ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. నిజానికి చెదురుమదురు ఘటనలు మినహా ఈ ఎన్నికలు చాలా సజావుగా,…
Telugu cinema witnessed two new theatre films this weekend in the form of Aadarsha Kutumbam(AK-47)…