
40 లక్షల విలువైన ఎల్వీఎంహెచ్ – ట్యాగ్ వాచ్, 27 లక్షల ఖరీదైన టయోటా ప్రిస్ కారు తనకు బహుమతిగా వచ్చాయని ఆమె వెల్లడించగా, ఆదాయపు పన్ను సెక్షన్ 28 (4) ప్రకారం వాటిపై పన్ను చెల్లించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ఐటీ అధికారుల నుంచి తాజా నోటీసులు ఆమెకు వెళ్లినట్టు తెలుస్తోంది. 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచి ఆమె పన్నులను ఎగ్గొడుతున్నట్టు తెలుస్తోంది.
రెడ్ చిల్లీస్ ఎంటర్టెయిన్మెంట్ నుంచి 17.06 లక్షల విలువైన ఆభరణాలను ఆమె బహుమతిగా పొందిందని, ఓ పెంట్ హౌస్ కూడా ఆమెకు గిఫ్ట్ గా లభించిందని, దానిని అద్దెకు ఇచ్చిన ప్రియాంక దానిపై పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని పొందుతోందని, వీటిపైనా పన్నులు చెల్లించాల్సిందేనని అధికారులు అంటున్నారు. 2007-08లో 50 లక్షల ఆదాయానికి లెక్కలు చూపలేదని, 2008-09లో అద్దె రూపంలో 6 లక్షలు పొంది లెక్కల్లో కలపలేదని తేల్చిన అధికారులు, ఆమెపై చర్యలకు సిద్ధమవుతున్నారు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…