
ఢిల్లీలో పలు వ్యాపార సంస్థలు, నిపుణులు, చార్టెడ్ అకౌంటెంట్లతో ఐటీ శాఖ కమిషనర్ ఏకే చౌహాన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పలు అకౌంట్లోలకి లెక్కల్లో చూపని డబ్బును జమ చేసిన వారు… ఇప్పటికైనా ‘ప్రధాన మంత్రి గ్రామీణ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై)’ కింద పన్ను చెల్లించాలని, గడుపు పూర్తయిన తర్వాత తమ విచారణలో ఎవరైనా బయటపడితే… కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆర్థిక ఇంటెలిజెన్స్, ఇతర సంస్థలు ఇస్తున్న డేటాను పూర్తిగా పరిశీలిస్తున్నామని…. నల్లకుభేరులు నిశ్చింతగా ఉండొద్దని హెచ్చరిస్తున్నామని తెలిపారు. పీఎంజేకేవై పథకం గడువు ముగియక ముందే పన్నులు చెల్లించాలని… ఒకసారి గడువు ముగిస్తే పన్ను ఎగవేతదారులకు కష్టాలు తప్పవని చౌహాన్ హెచ్చరించారు. పీఎంజీకేవై అనేది ఆదాయ వెల్లడి పథకం పార్ట్-2 కాదని… ఈ పథకం ఉద్దేశాలే వేరని చెప్పారు.
Suriya 50 is suddenly turning into one of the most talked-about projects in Tamil cinema,…
ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కొండా సురేఖ రాజకీయాలలో ఉన్నారు. కనుక ఆమెకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది.…