
2015లో యూఏఈలో నివసిస్తోన్న భారతీయుల సంఖ్య 35 లక్షలుగా పేర్కొనగా, ఆ దేశంతో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు కూడా ఇండియా నుంచి ప్రజలు అత్యధిక సంఖ్యలో వలసలు వెళ్లారని చెప్పింది. గల్ఫ్ దేశాల్లో భారతీయుల సంఖ్య గత ఏడాది 80 లక్షల మందికి పైగా ఉందని, ఈ సంఖ్య 1990లో 20 లక్షలని తెలిపింది. భారత్ తరువాత అత్యధిక వలసదారుల సంతతి కలిగిన దేశంగా మెక్సికో నిలిచింది.
ఆ దేశం నుంచి ఇతర దేశాలకు కోటి 23 లక్షల మంది వలసలు వెళ్లారు. ఇక ఆ తరువాతి స్థానాల్లో కోటి 6 లక్షల మందితో రష్యా, 95 లక్షల మందితో చైనా, 72 లక్షల మందితో బంగ్లాదేశ్ ఉన్నాయి. అయితే ఆయా దేశాల నుండి అత్యధికంగా అమెరికాకే వలసలు వెళ్లారు. మొత్తం 4 కోట్ల 66 లక్షల మంది వలసదారులతో అత్యధికంగా వలసదారులకు ఆశ్రయం ఇచ్చిన దేశంగా అమెరికా నిలిచింది. ఇదే అంశంలో రెండో స్థానంలో కోటి 20 లక్షల మందితో జర్మనీ, కోటి 16 లక్షల మందితో రష్యా, కోటి 2 లక్షల మందితో సౌదీ అరేబియా, 85 లక్షల మందితో బ్రిటన్ దేశాలు ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…