
పెహాల్గమ్ ఉగ్రదాడికి ప్రతి పాక్ ఉగ్రవాదం పై భారత సేన జరిపిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ చుక్కలు చూసింది. భారత్ వాయు సేన విజృంభణ తో పాక్ ఆర్మీ తోక ముడిచింది, పాక్ ఉగ్రవాదం తలవంచింది.
అయితే నాడు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు, భారత ఆర్మీ చేసిన సాహసాలకు పాకిస్తాన్ భారత్ తో కాళ్లబేరానికొచ్చింది. రెండు దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధ వాతావరణాన్ని కూడా తట్టుకోలేని పాకిస్తాన్ భారత్ తో సంధి చర్చలు చేసుకుని బతుకు జీవుడా అంటూ బయటపడింది.
అయితే కింద పడ్డా, పై చేయి నాదే అన్నట్టుగా ఓడిపోయినా గెలుపు మాదే అంటూ నాడు పాకిస్తాన్ తన వక్ర బుద్దిని బయటపెడుతూ భారత్ పై పాక్ విజయం సాధించింది అంటూ విజయోత్సవ ర్యాలీలు, గెలుపు సంబరాలు చేసుకున్నారు.
ఆ సంబరాలను, పాక్ చర్యలను చూసి ప్రపంచమే నవ్వినా, పాక్ మాత్రం సింధు నదీ జలాల కోసం భారత్ ముందు చేతులు చాస్తూనే భారత్ పై పై చెయ్యి అంటూ ప్రకటలు చేసింది. అయితే నాడు భారత్ ఆర్మీ చేతిలో చావు దెబ్బ తిని గెలుపు సంబరాలు చేసుకున్న పాక్ నేడు టీం ఇండియా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది.
ఆసియా కప్పులో భాగంగా దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఇండియా – పాకిస్తాన్ టి – 20 మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్ టీం ను భారత్ బౌలింగ్ విభాగం పూర్తిగా కట్టడి చేయగలిగింది. దీనితో 127 పరుగుల లక్యంతో బరిలోకి అడుగు పెట్టిన భారత్ ఆపరేషన్ సింధూర్ మాదిరి సునాయాసంగా పాకిస్తాన్ ను మట్టికరిపించింది.
అయితే నాడు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ను రెచ్చకొట్టేలా పాక్ ఆర్మీ చేసిన చర్యల మాదిరే పాకిస్తాన్ కామెంటేటర్ తన్వీర్ అహ్మద్ సైతం బుమ్రా బౌలింగ్ లో పాక్ ఓపనర్ సయమ్ ఆయూబ్ సిక్స్ సిక్సులు కొట్టబోతున్నాడు అంటూ కవ్వించారు, చివరికి వచ్చిన ఫస్ట్ బౌల్ కే అదే బుమ్రా కు క్యాచ్ ఇచ్చి డక్ అవుట్ గా పెవిలియన్ బాట పట్టాడు.
ఇక ఇండియన్ స్పిన్నర్స్ బౌలింగ్ లో సిక్స్ బాల్స్ కి సిక్స్ సిక్సులు కొడతాం అంటూ రెచ్చకొడితే అదే స్పిన్నర్స్ కి పాకిస్తాన్ ఆరు వికెట్లు సమర్పించుకుంది. ఇలా మ్యాచ్ ప్రారంభం కాకముందు నుంచి టీం ఇండియా మీద తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ భారత క్రికెట్ సేన తగ్గేదెలే అన్నట్టుగా పాకిస్తాన్ పై రెచ్చిపోయింది. భారత్ దెబ్బ ఎలా ఉంటుందో మరోసారి పాక్ కి రుచి చూపించింది.
భారత్ కు ఎదురొడ్డి పోరాడితే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందో నాడు భారత ఆర్మీ సేన పాక్ కి రుచి చూపిస్తే నేడు భారత క్రికెట్ సేన దాన్ని కొనసాగించింది. అయితే నాడు ఓడిపోయి విజయోత్సవ ర్యాలీలు చేసుకున్న పాకిస్తాన్ నేడు కూడా తమ ఓటమిని గెలుపుగా చిత్రీకరించగలుగుతుందా.? ఈ ఓటమికి కూడా గెలుపు సంబరాలు జరుపుకుంటుందా.?
Srushti Bannatti is bringing a punchy pop of lime green to the fashion frame, and…
Aniesh made a good impression with his performance in the songs and teaser of Itllu…