
2025 ఆసియా కప్ మొదలయ్యి ఇప్పటికే లీగ్ స్టేజి ను ముగించుకుని, గ్రూప్ స్టేజి కి చేరుకుంది. అయితే, రెండు స్టేజీల్లోనూ పెద్దగా మారానిది ఏమైనా ఉందా అంటే అది పాకిస్థాన్ జట్టుకు జరుగుతున్న అవమానాలు మాత్రమే అని చెప్పాలి.
లీగ్ స్టేజి లో హ్యాండ్- షేక్ అంటూ అవమానాల పాలైన పాక్, గ్రూప్ స్టేజిలో నిన్న భారత్ కెప్టెన్ సూర్య మాటలకు మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్ధమవ్వక నవ్వుల పాలయ్యింది.
అయితే, ఆసియా కప్ లో తమ మొదటి మ్యాచ్ ను ఒమాన్ వంటి పసికూన పై ఆడి, ఆ మ్యాచ్ ను సొంతం చేసుకుంది పాక్. రెండవ మ్యాచ్ గా భారత్ మరియు పాకిస్థాన్ తలపడగా, అందులో అనుకోని వింతలేమి జరగలేదు. అందరు ఊహించినట్టే, భారత్ ధాటికి నిలవలేక చతికిలపడ్డది పాక్ జట్టు.
అయితే, జరిగిన చేదు నిజాన్ని పాక్ అంగీకరించలేక, మ్యాచ్ కు ముందు, మ్యాచ్ అనంతరం మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన పనులను పట్టుకుని, క్రీడా స్ఫూర్తి చూపించటంలేదని సన్నాయి నొక్కులు నొక్కారు. తమకు హ్యాండ్-షేక్ ఇవ్వలేదంటూ పాక్ తమ కెప్టెన్ ను పోస్ట్-మ్యాచ్ ప్రెసెంటేషన్ కు వెళ్లనివ్వలేదు.
ఇందుకు గాను, పాక్ బోర్డు ఆరోజు రిఫరీ గా ఉన్న ఆండీ పైక్రోఫ్ట్ పై ఐసీసీ కు ఫిర్యాదు చేసింది. అయితే అందుకు బదులుగా పాక్ కు, ఐసీసీ నుండి తిరస్కరణ మాత్రమే దక్కింది. దానికి ప్రతిగా పాక్ తమ తరువాయి మ్యాచ్ ను బాయ్కాట్ చేస్తామంటూ హడావిడి చేసినప్పటికీ, మ్యాచ్ ను ఒక గంట ఆలస్యంగా మొదలుపెట్టి, పూర్తి ఆట ఆడారు.
అయితే, అసలు అవమానాలు ఈ గ్రూప్ స్టేజి లోనే నెలకొన్నాయి. ఎవరి మీదైతే పాక్ ఐసీసీ కు ఫిర్యాదు చేసిందో, అదే ఆండీ ఫ్రైక్రోఫ్ట్ గ్రూప్ స్టేజి లోని భారత్-పాక్ మ్యాచ్ కు తిరిగి రిఫరీ గా వ్యవహరించారు. నిన్న మ్యాచ్ మొదలైన 10 ఓవర్ల కే 90 పరుగులు చేసి, ఓపెనర్ ఫహీమ్ 50 పూర్తి చేసాక, గన్-ఫైరింగ్ సెలెబ్రేషన్ తో హడావిడి చేసింది పాక్.
కానీ వారికి ఆ ఉత్సహం ఎక్కువ కాలం నిలవలేదు. భారత బ్యాటింగ్ మొదలైన 3-4 ఓవర్ లకే పాక్ బౌలర్ లకు అసలు విషయం అర్ధమైపోయింది. షహీన్, అయూబ్, అబ్రార్ ఇలా బౌలర్ ఎవరైనా తమ ఆటతీరు ఒకటే అన్నట్టుగా భారత ఓపెనర్లు ‘అభిషేక్ – గిల్’ ఆది లోనే పాక్ కు అంతం చూపించేసారు.
రెండు-మూడు వికెట్లు వరుసగా కోల్పోయినప్పటికీ, తిలక్ – హార్దిక్ మ్యాచ్ ను ముగించి యధా-విధిగా డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్నారు. అయితే అభిషేక్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా, మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ – కాన్ఫరెన్స్ లో టీం ఇండియా కెప్టెన్ సూర్య పాకిస్తాన్ జట్టు కు మరిచిపోలేని రిటర్న్ గిఫ్ట్ సమాధానంగా ఇచ్చారు.
పాక్ ఆటతీరు సూపర్ -4 లో మెరుగయిందా.? గ్రౌండ్ లో భారత్ – పాక్ మధ్య రైవలరీ ఎలా అనిపించింది.? అనే ప్రశ్నలకు ‘మీరు, ఇకనుండి ఈ క్లాష్ ను రైవల్రీ అనకండి! ఇద్దరు సరి-సమానంగా నెగ్గితే దానిని రైవల్రీ అంటారు. 10-0 లేదా 10-1 తో ఉంటె దానిని రైవల్రీ అనరు’ అంటూ పాక్ ను కోలుకోలేని దెబ్బ తీసాడు.
దీనితో ఇండియా – పాక్ మధ్య జరిగిన ఆసియా కప్పు రెండవ మ్యాచ్ లోను పాక్ కు భారత్ నుంచి ఓటమి అవమానంతో పాటు సూర్య ఘాటు వ్యాఖ్యలు కూడా మానసికంగా కుంగతీసినట్లయ్యింది.
Aniesh made a good impression with his performance in the songs and teaser of Itllu…
Tom Cruise can still make audiences run to theatres, but it seems they need a…