
నేటితో ముగిసిన భారత్ vs ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ లో భారత జట్టుపై భారీ విజయాన్ని సాధించింది ఆస్ట్రేలియా జట్టు. ఈ మ్యాచ్ ముగవటంతో పాటు, అభిమానులకు డబ్ల్యూ.టీ.సి ఫైనల్ ఆశలు కూడా ముగిసాయి. దాదాపు రెండు నెలల క్రితమే ఫైనల్ లో భారత్ చోటు ఇంచుమించు ఖరారయిపోయింది.
కేవలం రెండు నెలల గడువులో ఓడలు బళ్లయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి. టెస్ట్ ఫైనల్ పాయింట్ల పట్టిక లో మూడవ స్థానం లో ఉన్న సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఫైనల్ కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. ఇక ఈ ఓటమి తో భారత్ ఇంటి దారి పట్టినట్టే. ఇక,మ్యాచ్ సంగతికి వస్తే, ఓవర్-నైట్ బ్యాటర్లు బొలాండ్ మరియు లయోన్ బ్యాటింగ్ కు రాగా, బుమ్రా ఆ వికెట్ ను అందుకుని తన 5 -ఫర్ ను మరోసారి సాధించాడు.
ఈ సిరీస్ లో అతనికి ఇది 3 వ ఫైఫర్. అయితే, 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, మొదటి నుండి డ్రా కోసం ఆడుతున్నట్లే కనిపించింది. ఓవర్ కు సగటు 1 .5 పరుగులతో 16 ఓవర్లు ఆడారు. ఇక రోహిత్, రాహుల్ ఒకే ఓవర్లో తమ వికెట్లను సమర్పించుకున్నారు. వచ్చిన కోహ్లీ కూడా చాలా నెమ్మదిగా రన్స్ చేసారు.
ఆ క్రమంలో మరొకసారి ఇంకొక అవుట్-సైడ్ ఆఫ్ స్టాంప్ బాల్ కే అతను అవుట్ అవ్వటం ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టుకు పంత్-జైస్వాల్ భాగస్వామ్యం కాస్త ఊరటను కలిగించింది. రెండవ సెషన్ మొత్తం వికెట్ పడకుండా ఆడారు ఈ ఇద్దరు. అయితే, మూడవ సెషన్ లో పంత్ మరలా తన వికెట్ ను ఒక అనవసర షాట్ కు యత్నించి కోల్పోయాడు.
ఇక ఈ వికెట్ పడే సమయానికి స్కోరు 121 /3 గా ఉండగా, భారత్ 155 పరుగులకు ఆల్-అవుట్ అయ్యారు. దీని బట్టే అర్ధమవుతుంది మరొకసారి భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారని. ఒకరి తరువాత ఒకరు పెవిలియన్ కు వెనువెంటనే తరలిపోయారు. జైస్వాల్ ఉన్నంతసేపు చక్కగా ఆడినప్పటికీ, ఏకాగ్రత కోల్పోయి తన వికెట్ ను సమర్పించుకున్నాడు.
చివరికి, తన మొదటి ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి ‘మొదటి 100 ‘ మరియు బుమ్రా తీసిన 5 -ఫర్ బూడిదలో పోసిన పన్నీరు లాగే అయ్యాయి. ఒక వర్గం అభిమానులు భారత్ స్కోరును ఛేజ్ కూడా చేస్తారని నమ్మారు. ఇక ఈ మ్యాచ్ చూసాక ‘ఈ మ్యాచ్ కోసమా పొద్దున్న 4 కు లేసింది?’ , ‘కొత్తగా ఏమయింది, అనుకున్నదే జరిగింది.!’ అంటూ సోషల్ మీడియాలో తమ ఆవేదనను షేర్ చేసుకుంటున్నారు అభిమానులు.
ఇక ఈ ఓటమితో జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టులో సీనియర్ ప్లేయర్ గా ఉన్న కోహ్లీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాట్ తో సమాధానం చెప్పల్సిన చోట కోహ్లీ చూపిన అసందర్భ ఆవేశం జట్టు ఓటమిని ఆపగలిగిందా అంటూ కోహ్లీ మీద, ఒక సీనియర్ ఆటగాడిగా, కెప్టెన్ గా ఉన్న రోహిత్ కూడా వేడుకకు హాజరైన గెస్ట్ మాదిరి గ్రౌండ్ లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారంటూ, గెలవలేకపోయినా కనీసం ఓటమి నుంచి తప్పించుకునేలా కూడా ఆడలేకపోతున్నారా అంటూ మండిపడుతున్నారు క్రికెట్ అభిమానులు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…