
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాపై భారీగా సుంకాలు విధిస్తే చైనా కూడా అమెరికా దిగుమతులపై భారీగా సుంకాలు విధించి సవాలు విసిరింది. ఎందువల్ల చైనా ఆర్ధిక వ్యవస్థ అంత బలమైనది. అన్ని రంగాలలో చైనా స్వయం ప్రతిపత్తి సాధించింది కనుకనే.
భారత్ ఆర్ధిక వ్యవస్థ కూడా బలంగానే ఉన్నప్పటికీ అమెరికాతో రాజీ ధోరణితోనే ముందుకు సాగుతూ నష్టం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప చైనాలా ట్రంప్‌ని ఎదిరించే ప్రయత్నం చేయలేదు. ఇది విజ్ఞతతో కూడిన నిర్ణయం. కనుక త్వరలోనే భారత్ ఈ సమస్యని అధిగమించడం తధ్యమే.
ఇప్పుడు భారత్-పాక్ మద్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నప్పుడు పాకిస్థాన్ కూడా ఈవిదంగా వ్యవహరించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ వెంటనే క్షిపణి పరీక్షలకు సిద్దమైంది. అలాగే పాక్ పాలకుల మాటలు కూడా మితి మీరుతున్నాయి.
సింధూ నదీజలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసుకోవడం కుదరదని, అయినా దానిలో ప్రతీ నీటి బొట్టు కూడా పాకిస్థాన్ స్వంతం అని పాక్ మంత్రి అవాయిస్ లేఘరి అన్నారు. తమ హక్కులను కాపాడుకోవడానికి అంతర్జాతీయస్థాయిలో పోరాడుతామని, ఈ విషయంలో భారత్‌ని ధీటుగా ఎదుర్కొంటామని అవాయిస్ లేఘరి హెచ్చరించారు.
ఎగువనున్న భారత్‌లో నుంచి సింధూ నది దిగువన ఉన్న పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తూ ఆ దేశానికి జీవనాడిగా నిలుస్తోంది. ఈ నదీ జలాలలో అధిక శాతం పాకిస్తాన్‌కి విడిచిపెట్టేందుకు 1960లో ఇరుదేశాల మద్య ఒప్పందం జరిగింది.
అప్పటి నుంచి భారత్-పాక్ మద్య రెండు యుద్ధాలు, అనేకసార్లు తీవ్ర ఘర్షణలు, భారత్‌లో పాక్ ప్రేరిత ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నప్పటికీ భారత్ ఆ ఒప్పందానికి కట్టుబడే ఉంది.
కనుక ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని భారత్ ప్రకటించినప్పుడు, పాకిస్థాన్ చాలా ఆచితూచి మాట్లాడాలి కానీ ఈవిదంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఈ నిర్ణయంపై భారత్ పునరాలోచన కూడా చేయనీయకుండా చేస్తోంది.
ట్రంప్‌ని చైనా ధీటుగా ఎదుర్కోగలదు కనుకనే అమెరికా-చైనా ‘టిట్ ఫర్ టాట్’ గేమ్స్ ఆడకుంటున్నాయి. కానీ ఇప్పటికే తీవ్ర నీటి కొరత, ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్, భారత్‌ని రెచ్చగొట్టి నెగ్గుకు రాగలదా? భారత్ ఆంక్షలు ప్రకటించగానే పాక్ స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి.. అదే సింధూ నది జలాలను పూర్తి స్థాయిలో భారత్ వినియోగించుకోవడం మొదలుపెడితే?
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…