Telugu

పాక్ ప్రకటనలు – షరతులు…ఐసీసీ పట్టించుకుంటుందా.?

ప్రస్తుతం భారత్లో జరుగుతున్న టీ -20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటికే బంగ్లా నిష్క్రమించగా, పాక్ కూడా అదేబాటలో బంగ్లాకు మద్దతుగా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుందేమో అనుకున్నారు బంగ్లా అభిమానులు.

కానీ కొన్ని రోజుల నిశ్శబ్దం తరువాత పాకిస్తాన్ మరొక డ్రామా కు నాంది పలికారు. తాము టి-20 వరల్డ్ కప్ ను ఆడతాము గాని ఇండియా తో జరిగే మ్యాచ్ ను బాయ్కాట్ చేస్తామని నేరుగా పాక్ ప్రధాని ప్రకటించారు. పీ.సి.బీ దీనిపై తొలుత ఎటువంటి నిర్ణయం ప్రకటించనప్పటికీ, తరువాత తమ గవర్నమెంట్ ఎం చెబితే తాము అదే చేస్తామంటూ తెలిపారు.

ADVERTISEMENT

అయితే, ఇక్కడ ఐసీసీ కు వచ్చే నష్టం చూస్కుంటే తొలుత ఇండియా లో షెడ్యూల్ చేస్లయినా మ్యాచ్లను పాక్ కోరిక మేరకు లంక కు మార్చగా, మరలా తాము ఆడమంటూ డ్రామాలు చేస్తే కేవలం ఐసీసీ కే కాదు, మ్యాచ్లను హోస్ట్ చేస్తున్న శ్రీలంక బోర్డు కూడా భారీ స్థాయిలో నష్టపోకతప్పదు.

ఇటీవల వచ్చిన రిపోర్టుల ప్రకారం పాక్ భారత్ తో మ్యాచ్ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదని తేలింది. అయితే వారు ఎప్పుడు ఏ మాట మాట్లాడతారనేది తమకే తెలియదని తాజాగా వచ్చిన రిపోర్ట్స్ చూస్తే అర్ధమవుతుంది. నేడు ఐసీసీ – పీ.సి.బీ – బీ.సి.బీ వర్చ్యువల్ మీట్ లో పాల్గొనగా, పాక్ 3 షరతులు పెడుతూ ఇండియా-పాక్ మ్యాచ్ ఆడటానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

తొలుత, ఐసీసీ ఈ మ్యాచ్ రద్దయితే తమకు నష్టం వచ్చే 2200 కోట్ల రూపాయలను ఒక్క పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏ కట్టాలని తేల్చి చెప్పగా, ప్రస్తుత పీ.సి.బీ వాల్యూ 400-500 కోట్లు ఉండగా, వారి లీగ్ పీ.ఎస్.ఎల్ వాల్యూ 1500 కోట్లు ఉంది. అయితే ఈ రెండిటిని అమ్ముకున్నా పీ.సి.బీ చెల్లించాల్సిన లెక్క చెల్లదు కాబట్టి మ్యాచ్ ఆడక తప్పదు.

అయితే ఇందుకై పాకిస్తాన్ బోర్డు కొన్ని నెరవేరని కలలు కంటున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. మొదటిగా ఐసీసీ తమకు ఏటా పంపించే రెవిన్యూ కంటే ఈసారి మరికొంత ఎక్కువ రెవెన్యూ పంపాలని కోరగా, రెండవది ‘ఇండో-పాక్ బిలాటరల్ సిరీస్ లు జరగాలి’ అని కోరుకున్నట్టు తెలుస్తుంది.

ఇక మూడవది, ఆసియ కప్ లో మన జట్టు ఆటగాళ్లు పాక్ ప్లేయర్స్ కు షేక్-హ్యాండ్ ఇవ్వలేదని వారు ఏడ్చిన ఏడుపు ఇంకా ఆగినట్టు లేదు, మూడవ షరతుగా ఇండియా ప్లేయర్స్ తమకు షేక్-హ్యాండ్ ఇవ్వాలని కోరుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఒక్క షరతు కూడా నెరవేరేటట్లు కనిపించటం లేదు.

గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ వేదికగా మన గవర్నమెంట్ ఇకపై ఇండో-పాక్ సిరీస్ లు ఉండవని స్పష్టం చేయగా, షేక్-హ్యాండ్ అనేది ఆటగాళ్ల ఇష్టం మేరకు ఇచ్చేది కాబట్టి ఐసీసీ దానికి సానుకూలంగా చేసేదేమి ఉండదు. ఇక, రెవిన్యూ పెంచే విషయమై ఐసీసీ నిర్ణయం తెలియాలి. చూడాలి మరి, ఈ రిపోర్ట్స్ ఎంతమేరకు నిజమేనని..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bigg Boss Telugu: Two Evictions Already In The House

For the first time in Bigg Boss history, there is a double eviction in the…

5 hours ago

Toxic English Version Flops: Yash’s Ramayana at Risk?

Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…

6 hours ago