
క్రికెట్ చరిత్రలో ఎన్నో ఐకానిక్ క్లాషెస్ ఉన్నాయనటంలో సంకోచమే లేదు గాని, ఆ ఐకానిక్ క్లాషెస్ అనే మాట వినగానే అభిమానుల మదిలో మెదిలే మొదటి ఊహ ‘ఇండియా-పాకిస్తాన్’..! అయితే ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా, ఆసీస్-న్యూజిలాండ్, ఇండియా-ఆస్ట్రేలియా వంటి మరెన్నో ఇతర క్లాషెస్ ఉన్నా ఇండో-పాక్ కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి.
అంతటి ఆదరణ ఉన్న ఈ పోరులో ఇద్దరు సమ-ఉజ్జీలయ్యుంటారు అనుకుంటే మనం భ్రమ పడుతున్నట్టే. క్రికెట్ మన దేశంలో ప్రాచుర్యంలో లేని వేళ పాక్ మనల్ని డామినేట్ చేసినప్పటికీ, కపిల్ దేవ్ చేతికి పగ్గాలొచ్చినప్పటి నుండి పాక్ పై మన జట్టు ఆధిక్యత చూపుతూనే వస్తుంది.
మరి అప్పటినుండి భారత్ పాకిస్తాన్ ను గేమ్ లో డామినేట్ చేస్తూనే ఉంది. కానీ, ఆటలో గెలుపోటములు సహజమనే ఇంగితం అందరికి ఉండదనే విషయం గ్రౌండ్ లో పాకిస్తాన్ ను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. విజయాలు అలవాటైతే ఒక విజయాన్ని ఎంత వరుకు సెలెబ్రేట్ చేసుకోవాలో ఆ జట్టుకి అర్ధమవుతుంది.
కానీ అదే పనిగా ఒక జట్టు మల్టి-నేషనల్ టోర్నీలలో గత 20 ఏళ్లగా అలుపెరగకుండా ఓడుతూనే వస్తుంటే, వారికి ఒక్క విజయం కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, రాక రాక వచ్చే అవకాశం కనుక ఆ మ్యాచ్లోనే వారు ఓవర్ గా సెలెబ్రేట్ చేసుకుంటారు.
ఇదంతా నిన్న జరిగిన ఇండియా-పాక్ అండర్-19 ఆసియ కప్ ఫైనల్ లో చూడవచ్చు. ఫైనల్స్ లో తొలుత బ్యాట్టింగ్ చేసిన పాక్ ఏకంగా 347 పరుగులు అందుకుని సుమారు గెలుపును ఖాయం చేసుకున్నారు. స్కోర్ ఛేజ్ లో తొలి 2 ఓవర్లు మెరుపులు మెరిపించి వైభవ్ అవుట్ అవటంతో జట్టు కుప్పకూలిపోయింది.
కెప్టెన్ ఆయుష్, వైభవ్ సూర్యవంశీ వికెట్లు పడ్డప్పుడు పాక్ బౌలర్ మరియు ఫాన్స్ కొంచెం అతిగా సెలెబ్రేట్ చేసుకున్నారనే చెప్పవచ్చు. బ్యాటర్స్ ను ట్రిగ్గర్ చెయ్యాలనే ఉద్దేశంతోనే రెచ్చగొట్టినట్లు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్న ఆ సమయంలో, సూర్యవంశి ‘మీరు నా పాదాలతో సమానం’ అనే విధంగా తన షూస్ ను చూపించాడు.
ఇక, పాకిస్తాన్ ఇటీవల జరిగిన మేన్స్ ఆసియా కప్ 2025 లో కూడా, ఓటమి అంచుల్లో ఉన్న సమయంలో ఆటలో చేసేదేమి లేక, గ్రౌండ్ కు వచ్చిన అభిమానులను టార్గెట్ చేసి ఆపరేషన్ సింధూర్ పై అనుచిత యాక్షన్స్ తో తమ బుద్ధి ఎటువంటిదనేది మరలా గ్లోబల్ స్టేజ్ లో చాటివేసుకున్నారు.
అయితే, ఒక పక్క సీనియర్లు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ తో తలపడ్డ మ్యాచ్ లన్నిటిలోను గెలుపొంది మంచి రిథం లో ఉన్న సమయంలో జూనియర్లు ఘోర ఓటమి చెంది ఆసియ కప్ ను కోల్పోయారు. అయితే, ఇదే ఆసియ కప్ ఫైనల్ లో 2 నెలల ముందు సీనియర్ జట్టు కష్ట పరిస్థితులను అధిగమించి, చాకచక్యంగా మ్యాచ్ ను గెలుపొందడం విశేషం.
Unlike the usual approach seen in recent times, the makers of The Paradise have chosen…
Tamil cinema has not had a great run with big-ticket sequels. The first film works,…