
ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ సైనిక దళాలకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నామని, దానికి టైమ్, డేట్ వాళ్ళే నిర్ణయించుకుంటున్నారని ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేయడంతో పాకిస్థాన్‌పై భారత్ ప్రతీకార దాడి చేయబోతోందని సూచనప్రాయంగా చెప్పేసినట్లే.
కనుక దాడికి ముహూర్తం ఎప్పుడు పెట్టారో ఎవరూ చెప్పలేదు కానీ పాక్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ చెప్పేశారు. మహా అయితే మరో 24-36 గంటలలో తమ దేశంపై భారత్ దాడి చేయబోతోందని తమకు పక్కా సమాచారం ఉందని చెప్పారు.
పహల్గాం ఉగ్రదాడిపై స్వతంత్ర్య సంస్థతో పారదర్శకంగా దర్యాప్తు చేయించేందుకు భారత్ అంగీకరిస్తే తాము అన్నివిదాలా సహకరిస్తామని చెప్తున్నా భారత్ ఏకపక్షంగా దాడికి సిద్దమవుతుండటం చాలా శోచనీయమని అన్నారు. కానీ భారత్ దాడి చేస్తే పాకిస్థాన్ చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోదని, ధీటుగా ఎదురుదాడి చేస్తుందని గ్రహించాలని పాక్ మంత్రి అతవుల్లా తరార్ అన్నారు.
భారత్, పాకిస్థాన్ విడిపోయిన తర్వాత ఈ ఏడున్నర దశాబ్ధాలలో పాకిస్థాన్ దేశాన్నే అభివృద్ధి చేసుకోలేకపోతున్న పాక్ పాలకులు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని అభివృద్ధి చేస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. దానిని భారత్‌పై ఉగ్రదాడులు చేసేందుకు ‘బేస్ క్యాంప్’గా మార్చేయడంతో వారితో, పాక్ సైనికులతో స్థానికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనుక పాకిస్థాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారు. కానీ ఉక్కుపాదంతో వారిని అణచివేస్తోంది.
తన అధీనంలో ఉన్న కశ్మీర్‌ని చక్కబెట్టుకోలేకపోతున్న పాక్ పాలకులు, భారత్ నుంచి కశ్మీర్‌ని వేరు చేయాలని దశాబ్ధాలుగా కుట్రలు, దాడులు చేయిస్తూనే ఉన్నారు. అదే సమయంలో జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని నిర్మూలించి అన్ని విదాలుగా అభివృద్ధి చేస్తోంది భారత్ ప్రభుత్వం. పహల్గాంలో పర్యటకులే ఇందుకు తాజా నిదర్శనం. వారిని పాక్ ప్రేరిత ఉగ్రవాదులు కాల్చి చంపడమే పాక్ వైఖరికి తాజా నిదర్శనం.
భారత్, పాకిస్థాన్ అధీనంలో ఉన్న కశ్మీర్ విషయంలో రెండు ప్రభుత్వాల వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే, పాక్ పాలకులు ఎంత మూర్ఖంగా, అవివేకంగా వ్యవహరిస్తున్నారో అర్దమవుతుంది.
ఇదివరకు కార్గిల్, పూల్వామా దాడి తర్వాత భారత్ ఎంత తీవ్రంగా స్పందించిందో కళ్ళారాచూసిన తర్వాత కూడా పాక్ పాలకులు, సైనికాధికారులు భారత్‌తో చెలగాటం ఆడుతూనే ఉన్నారు. అది నిప్పుతో చెలగాటమే అని భారత్ మరోసారి నిరూపించబోతోంది. దానికీ పాక్ పాలకులే 24-36 గంటలని ముహూర్తం పెట్టేసుకోవడం విశేషం.
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…