
భారత్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టి-20 వరల్డ్ కప్ లో హోమ్ టౌన్ అడ్వాంటేజ్ తో భారత్ హాట్-ఫెవరేట్స్ గా బరిలోకి దిగింది. గ్రూప్ స్టేజిలో ఆడిన 4 మ్యాచ్లు గెలిచి సూపర్-8 కు అర్హత సాధించింది టీం ఇండియా. కానీ, గెలిచిన 4 మ్యాచ్లు కూడా మనవారు అంత సులువుగా గెలవలేదు.
అమెరికా జట్టు తో ఆడిన తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ కుప్పకూలిపోయిన సమయంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తన స్టాండింగ్ తో భారత్ ను ఘోర పరాజయం నుండి కాపాడాడు. ఇక నమీబియా పై పాక్ పై మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించాడు. ఇలా బ్యాటింగ్ లో భారత్ కు ఎవరో ఒకరు మాత్రమే నిలబడుతన్నారు.
ఒకవేళ ఆ ఒకరు నిలబడకపోతే టీం ఇండియా పరిస్థితి ఏంటి అనేదానికి నిన్న అహ్మదాబాద్ లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ ఇందుకు నిదర్శనం. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి సూపర్-8 పోరులో భారత్ 76 పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూడక తప్పలేదు.
ఏకంగా 12 మ్యాచ్ల తరువాత టి-20 వరల్డ్ కప్ మ్యాచ్లలో భారత్ తొలి ఓటమిని నమోదు చేసుకుంది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తరువాత నుంచి జరిగిన ఐసీసీ ఈవెంట్లో భారత్ ఓటమి చెందిన తొలి మ్యాచ్ కూడా ఇదే.
అంతటి హైప్ తో బరిలోకి దిగిన టీం ఇండియా వరల్డ్ కప్ లో అనుకున్న స్థాయిలో ప్రదర్శించటంలేదు అనేది వాస్తవం. స్పిన్నర్లను సమర్ధవంతంగా ఆడే విధానంలో మన బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రతి మ్యాచ్లోను స్పిన్నర్లకు వికెట్లు సమర్పించుకోవడం అపోజిషన్ జట్లకు హైలైట్ అవుతుంది.
గ్రూప్ స్టేజి మొత్తం 0 కే పరిమితం అయ్యాడు no-1 టి-20 బ్యాటర్ అభిషేక్ శర్మ. 3 మ్యాచ్లు ఆడగా మూడిట్లోను డక్ అవుట్ గా వెనుదిరగటం ఫాన్స్ ను మూగబోయేలా చేస్తుంది. అదే బాటలో నడుస్తున్నాడు తిలక్ వర్మ. తన రోల్ యాంకర్ చేయటమే అని మేనేజ్మెంట్ వెనకేసుకొచ్చినప్పటికీ అతడు ఫామ్ కోల్పోయాడు అనేది వాస్తవం.
జట్టులోని ప్రతి ఆటగాడు బౌలర్ పై ఆధిపత్యాన్ని చలాయించాలని చూస్తున్నారే గాని, ఆ జట్టు పై ఆధిపత్యం చెలాయించాలంటే క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్ చేయాలనే సింపుల్ టెక్నీక్ ను మరిచిపోతున్నారు టీం ఇండియా యువ బ్యాటర్లు. గతంలో టీం ఇండియా 160+ స్కోరును కేవలం 3 సార్లు మాత్రమే విజయవంతంగా ఛేదించగలిగింది.
‘విరాట్ కోహ్లీ’ ఆ 3 మ్యాచ్లలో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అతనిలా క్రీజులో పాతుకుపోయి బ్యాటింగ్ చేసే బ్యాటర్ లేకపోవటమే నేటి భారత జట్టు ఓటమికి ఒక కారణమని చెప్పొచ్చు. సూర్య నెమ్మదిగా ఆడేందుకే ప్రయత్నించినా స్లో బాల్ కు టెంప్ట్ అయ్యి వికెట్ ను సమర్పించుకుంటున్నాడు.
గెలుపోటములను కాసేపు పక్కన పెట్టి చుస్తే టి-20 వరల్డ్ కప్ కు ముందు భారత్ చూపిన ఆటతీరు మరియు ఆధిపత్యం ఈ వరల్డ్ కప్ లో చూపించలేకపోయారు అనేది ముమ్మాటికీ అంగీకరించావల్సిన వాస్తవం. మ్యాచ్ లు గెలిచినన్ని రోజులు ఎవ్వరు ఏమి ప్రశ్నించరు.. కానీ ఓటములు మొదలయ్యాయి కాబట్టి జట్టు పై విమర్శలు కూడా పెరుగుతాయి. మరి ఈ సవాళ్ళను ఎదుర్కొని భారత్ ఉత్తమమైన ఆటను కనబరచలాని కోరుకుందాం..!
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…