
బహుశా శ్రీలంక క్రికెటర్లకు తెలుగు అర్ధం అయితే… రెండవ టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసిన తర్వాత అక్షరం పొల్లు పోకుండా సరిగ్గా ఇవే డైలాగ్స్ ను మళ్ళీ రిపీట్ చేసుకునేవారని చెప్పడంలో సందేహం లేదు. అవును… అంత పద్ధతిగా, అంత చక్కగా, అంత ముద్దొచ్చేలా చూడచక్కని షాట్లతో శ్రీలంక బౌలర్లకు అసలు సిసలు నక్షత్రాలు చూపించాడు రోహిత్ శర్మ.
కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడంటే రోహిత్ విధ్వంసం ఏ రీతిలో సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోహిత్ కు బాల్ పడిందంటే… సిక్సరా, ఫోరా అన్న సందేహమే తప్ప మరొకటి ప్రేక్షకుల మదిలో లేదంటే అతిశయోక్తి కాదు. అలా అని అవేవో గుడ్డి ఊపుడు మాదిరి షాట్లు కావు, అసలు సిసలు రోహిత్ శర్మ స్టైలిష్ షాట్స్.
బహుశా 20 ఓవర్ల పాటు క్రీజులో ఉండి ఉంటే, టీ20లలో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ గా చరిత్రలో నిలిచిపోతాడని ఒకానొక దశలో క్రికెట్ అభిమానులకు ఒక ఆశ కూడా వచ్చింది. కానీ 43 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 118 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రాహుల్ కూడా 89 పరుగులతో రాణించాడు గానీ, రోహిత్ ఇన్నింగ్స్ ముందు ఆ పరుగులు వెలవెలబోయాయి.
వీరిద్దరి బ్యాటింగ్ ప్రతిభతో నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 260 పరుగుల భారీ స్కోర్ ను టీమిండియా నమోదు చేసింది. టీ20లలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కాగా, ఓవరాల్ గా రెండవ స్థానంలో నిలిచింది. చివరి రెండు ఓవర్లలో పరుగులను నియత్రించడంలో శ్రీలంక సక్సెస్ కావడంతో ఓ 10 పరుగులైనా తగ్గాయి.
టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే…
Hunkkaar arrives with a subject that is bound to generate discussion, and its teaser suggests…