Telugu

అది వైసీపి డీఎన్ఏ… అమెరికా వెళితే మారిపోదుగా?

వైసీపి మద్దతుదారు సత్తారు వెంకటేష్ రెడ్డిని, పెన్మత్స నిఖిల్, పెనుమచ్చ శ్రబన్ అనే మరో ఇద్దరు వ్యక్తులను అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ముగ్గురూ ఆంధ్రా నుంచి ఓ 20 ఏళ్ళ యువకుడిని అమెరికాలో చదువు చెప్పిస్తామని చెప్పి సుమారు ఏడు నెలల క్రితం తమతో తీసుకువెళ్ళారు.

అప్పటి నుంచి వారు ముగ్గురూ అతనిని సెయింట్ చార్లెస్ కౌంటీ పోలీస్ స్టేషన్‌ పరిధిలోగల తమ ఇంట్లో బందించి, చిత్రహింసలు పెడుతూ పైశాచికానందం పొందుతున్నారు. రోజంతా ఇంటి పనిచేయించుకొంటూ, చిత్రహింసలు కూడా పెడుతూ అతనికి నరకం చూపించారు.

ADVERTISEMENT

అతను తప్పించుకొని పారిపోకుండా ఉండేందుకు ఇంట్లో ఉంచి తాళాలు వేసి వెళ్ళేవారు. ఇంట్లో అతని కదలికలను గమనించేందుకు సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ముగ్గురులో ఎవరైనా బయటకు వెళ్లినప్పుడు మిగిలినవారు అతనిని బెల్టుతో, కర్రతో లేదా అందుబాటులో ఉన్న ఏదో ఓ వస్తువుతో చితకబాదుతుంటే, అతను బాధ భరించలేక కేకలు పెడుతుండేవాడు. బయటకు వెళ్ళినవారు ఆ చిత్రహింసలను తమ మొబైల్ ఫోన్లో చూసి పైశాచికానందం అనుభవించేవారు.

అతను వారిలో ఎవరికీ అపకారం చేసింది లేదు. వారితో ఎటువంటి శతృత్వం కనీసం ముందస్తు పరిచయం కూడా లేదు. కానీ వారు ముగ్గురు ఏడు నెలలుగా అతనిని తమ ఇంట్లో బందించి చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు.

ఆ ఇంట్లో జరగరానిది ఏదో జరుగుతోందని చుట్టుపక్కల వారికి అనుమానం కలగడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సత్తారు వెంకటేష్ రెడ్డి, అతని స్నేహితులు వారిని ఇంట్లో ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

శాడిస్టులైన వారు ముగ్గురూ పైశాచికానందం కోసమే భారత్‌ నుంచి ఆ యువకుడిని అమెరికా తీసుకువచ్చిన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిపై మానవ అక్రమరవాణా, లైంగిక వేధింపులు, హింస, హత్యానేరం తదితర సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

వారి చేతుల్లో చిత్రహింసలు అనుభవించిన ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అతనికి ఒంటి నిండా అనేకా గాయాలున్నాయని, రెండు పక్కటెముకలు కూడా విరిన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స చేస్తున్నారు.

వెంకటేష్ రెడ్డి తాను ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి దగ్గర బంధువునని, తాను నేరుగా ఆయనతోనీ ఫోన్లో మాట్లాడి ఎటువంటి పనులైనా చిటికెలో చక్కబెట్టగలనని అమెరికాలో గొప్పలు చెప్పుకొంటాడని తెలుస్తోంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం గృహాప్రవేశం సమయంలో జగన్‌ పక్కనే ఉన్న ఫోటోలు, ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో ఉన్న ఫోటోలు మీడియాలో ఉన్నాయి కూడా. కనుక అతను వైసీపికి చెందినవాడేనని భావించవచ్చు.

అందుకే అతనిలో కూడా వైసీపి డీఎన్ఏ ఉంది. ఆ డీఎన్ఏలో ఇతరులను హింసించి పైశాచిక ఆనందం పొందడం కూడా ఉంది. కనుక అమెరికా వెళ్ళినంత మాత్రన్న డీఎన్ఎ మారిపోదు కదా? అదే ఇప్పుడు బయటపడిందనుకోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AP Civic Polls: TDP Gets 11 Corporations, Jana Sena 4, BJP 2

The TDP, Jana Sena and BJP have finalised their seat-sharing agreement for Andhra Pradesh’s urban…

9 minutes ago

Illinois Anti-Hindu Plot: India Lauds Timely Action

The plot to commit a mass shooting at a Hindu temple in Aurora has been…

39 minutes ago