
Why Sensex And Nifty Continue To Fall
ఇండియన్ స్టాక్ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ కొనసాగుతూ పోతుంది. రోజురోజుకి మార్కెట్లు బ్లడ్ బాత్ ను సృష్టిస్తూ ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనలోకి నెడుతున్నాయి. భారత మార్కెట్లలో సెప్టెంబర్ నెలలో వరుసగా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుంది.
ఈ రోజు ఉదయం మార్కెట్లు ఓపెన్ అయినప్పటి నుంచి స్వల్పంగా కోలుకున్నట్టు కనిపించినప్పటికీ సెషన్ ముగిసే సరికి నిఫ్టీ 96 పాయింట్లు కోల్పోయి 22620 దగ్గర క్లోజ్ అవ్వగా, సెన్సెక్స్ 49 పాయింట్లు కోల్పోయి 72480 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. దీనితో భారత స్టాక్ మార్కెట్లలో క్రాషే కానీ క్యాష్ లేదా అన్న ఆందోళన ఎక్కువయ్యింది.
అయితే స్టాక్ మార్కెట్లలో ఈ వరుస పతనాల వెనుక అనేక బలమైన కారణాలే రాజకీయ, భౌగోళిక కనిపిస్తున్నాయి…వాటిలో మచ్చుకకు కొన్ని…
మొదటగా చమురు ధర పెరగడం : అమెరికా ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బేరల్ క్రూడాయిల్ ధర 103 డాలర్లుగా నమోదవుతుంది. ఈ ఇరు దేశాల యుద్ధ నేపథ్యంలో క్రూడ్ ధరలలో తీవ్రమైన ప్రతిష్టంభన నెలకొంటుంది.
FII ల భారీ అమ్మకాలు : విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సెప్టెంబర్ లో భారత ఈక్విటీల నుంచి భారీగా నిధులు వెనక్కి తీసుకోవడం, సెప్టెంబర్ 29 ఒక్క రోజునే FII లు సుమారు రూ. 9980 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇక సెప్టెంబర్ నెల మొత్తం పరిగణలోకి తీసుకుంటే రూ. 34 వేలకోట్ల పై చిలుకు విలువైన షేర్లను విక్రయించారు. దీనితో ఈ స్టేయిలో FII లు అమ్మకాల బాట పట్టడంతో దేశీయ మార్కెట్లు పతనం వైపుకి దూసుకుపోతున్నాయి.
అమెరికా బాండ్ యీల్డ్స్ పెరగడం : US 10ఇయర్స్ ట్రెజరీ యీల్డ్ 5.27% దాటడంతో విదేశీ ఇన్వెస్టర్లకు అమెరికా బాండ్ లలో తక్కువ రిస్క్ తో ఆకర్షణీయమైన రాబడి కనిపిస్తుంది. దీనితో భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్లు నుంచి ఇన్వెస్టర్లు ఎగ్జిట్ అయ్యేందుకు మొగ్గుచూపుతున్నారు.
రూపాయి బలహీనత : డాలర్ తో పోలిస్తే రోజురోజుకి రూపాయి విలువ పతనం అవ్వడం విదేశీ పెట్టుబడి దారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రూపాయి బలహీన పడితే భారత్ లో పెట్టుబడి పెట్టినా విదేశీ ఇన్వెస్టర్లకు డాలర్ పరంగా రాబడి మరింత తగ్గే అవకాశం ఉంటుంది. దీనితో భారత మార్కెట్లకు బదులు వారు US మార్కెట్ల వైపు ఆకర్షితులవుతున్నారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు : అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు, పశ్చిమ ఆసియా పరిస్థితుల పై స్పష్ట లేకపోవడం, రష్యా – ఉక్రెయిన్ మధ్య అలుపెరగని యుద్ధ వాతావరణం, ట్రంప్ టారీఫ్ల ప్రభావం, ఇలా అంతర్జాతీయ ఉద్రికత్తలు దేశీయ మార్కెట్లలో అనిశ్చితి పెంచుతుంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే ఆసక్తి చూపిస్తున్నారు.
ఇలా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా భారత స్టాక్ మార్కెట్ల పతనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు దేశంలో గణాంకాలతో కనిపించే వృద్ధి రేటు వాస్తవ పరిస్థితులలో కనిపించకపోవడం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని రాజకీయ, వాణిజ్య నిర్ణయాలు సైతం దేశీయ మార్కెట్ల పతనం పై ప్రభావం చూపుతున్నాయి.
ఈ ప్రభావం ఇలానే మరికొన్ని రోజుల పాటు కొనసాగితే స్టాక్ మార్కెట్ల పై ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన నుంచి సామాన్యుడి చాల దూరం జరిగే ప్రమాదం వస్తుంది. ఈ పతనం పరోక్షంగా దేశీయ వృద్ధి రేటు పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
DRI Hyderabad has seized cocaine valued at around Rs 24.5 crore at Hyderabad airport in…
Karthik Subbaraj is currently promoting his recently released film Dorothy through interviews and by participating…