వైసీపీ చరిత్ర బయటవారే చెప్పాలా… వద్దు!

రాజకీయ నాయకులు పార్టీలు వీడిన తర్వాత విమర్శలు చేస్తుండటం సర్వసాధారణ విషయమే. కానీ ముఖ్య నాయకులు పార్టీని వీడి చేసే విమర్శలు, ఆరోపణలకు మాత్రమే ఎక్కువ విలువ ఉంటుంది.

ADVERTISEMENT

ఇంతకాలం వైసీపీలో నంబర్:2గా ఉన్న విజయసాయి రెడ్డి పార్టీని వీడిన తర్వాత జగన్‌తో సహా పార్టీ ముఖ్య నేతలపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్ర గురించి విజయసాయి చెప్పిన విషయాలు, చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.. వాటితో వైసీపీ పునాదులు కదిలిపోతున్నాయి.

విజయసాయి రెడ్డిని ఎదుర్కొనే క్రమంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రతివిమర్శలు, ఆరోపణలకు కూడా చాలా విలువుంటుంది.

కసిరెడ్డి రెడ్డి స్పందిస్తూ “విజయసాయి రెడ్డి పచ్చి మోసగాడు. నా గురించి ఆయన చెప్పిన మాటలే విని మీడియా మిత్రులు తప్పుగా ఊహించుకోవద్దు. ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో నేను న్యాయపోరాటం చేస్తున్నాను. అది కొలిక్కి రాగానే మీడియా సమావేశం పెట్టి విజయసాయి రెడ్డి నీచ చరిత్ర బయటపెడతా. కనుక అంతవరకు ఓపిక పట్టాలని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అంటూ చిన్న ఆడియో సందేశం పంపించారు.

కనుక ఇప్పుడు మొత్తంగా చూస్తే వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీలో మిధున్ రెడ్డి, కసిరెడ్డి, సజ్జల తదితరులు ఎటువంటివారో విజయసాయి రెడ్డి పూసగుచ్చిన్నట్లు వివరిస్తుంటే, ఆయన ఎటువంటివారో వైసీపీ నేతలు కూడా పూస గుచ్చిన్నట్లు వివరిస్తున్నారు.

కనుక తమ నేర చరిత్ర గురించి వారే బయటపెట్టుకుంటున్నారు. తమ ప్రభుత్వం హయంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలు, దౌర్జన్యాల గురించి పూస గుచ్చిన్నట్లు ప్రజలకు వివరిస్తుంటే అవన్నీ విని సామాన్య ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

అక్రమాస్తుల కేసులు, వివేకా హత్య కేసు వంటి పలు కేసుల విచారణ మొదలైన తర్వాత సామాన్య ప్రజలకు కూడా చట్టాల గురించి అవగాహన పెరిగినట్లే, వీరందరి ఆరోపణలు, ప్రత్యారోపణల పుణ్యమాని వైసీపీకి సంబందించి ఇంతకాలం సామాన్య ప్రజల ఊహకు అందని అనేక రహస్యాలు తెలుస్తున్నాయి.

జగన్‌, కసిరెడ్డి రాజ్, మిధున్ రెడ్డి ఎలాంటి వారో ఏవిదంగా అక్రమాలు చేశారో విజయసాయి రెడ్డి చెప్పారు. కనుక ఆయన ఎలాంటివారో కసిరెడ్డి రాజ్ కూడా చెపితే విని జనం సంతోషిస్తారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

December 4 Clash: Nithiin vs Naga Chaitanya

Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…

34 minutes ago

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

1 hour ago