
టీమిండియా వరుస విజయాలు అందుకోవడంతో మంచి ఉత్సాహంలో ఉన్న క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ ఒక పండగలా మారింది. వివిధ దేశాల ఆటగాళ్లతో కలిసి లోకల్ గా కొత్త హీరోలను అందించే ఈ ఐపీఎల్ లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి, దీంతో టీవీలకు అతుక్కుపోవడం వీక్షకుల వంతవుతోంది. ముఖ్యంగా గత ఐపీఎల్ కు ఆదరణ తగ్గడంతో, ఈ ఏడాది ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది.
కానీ ఈ సీజన్ ను వీక్షకులు రికార్డు స్థాయిలో మ్యాచ్ లను వీక్షిస్తున్నారు. కేవలం మూడు మ్యాచ్ ల్లోనే 185.7 మిలియన్ల వీక్షకులు నమోదు కావడంతో ఐపీఎల్ స్పాన్సర్లు సంబరాల్లో మునిగిపోయారు. ఒక ప్రేక్షకుడు మ్యాచ్ ను చూసే సగటు సమయం 72 నిమిషాలుగా నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇది 10 సీజన్లలోకల్లా “ఆల్ టైమ్ రికార్డ్” అని ఐపీఎల్ అధికారికంగా వెల్లడించింది.
గత సీజన్ లో తొలి మూడు మ్యాచ్ లను వీక్షించిన వీక్షకుల సంఖ్య 160.7 మిలియన్లు కాగా, సగటు సమయం కేవలం 46 నిమిషాలు మాత్రమేనని ఐపీఎల్ తెలిపింది. ఈ సీజన్ తొలి వారం ఐపీఎల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుందని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. దీంతో బీసీసీఐకి కాసుల పంట పండుతోంది. ఈ ఒరవడి ఇంకా మరో నెల రోజులుపైగా ఉండడంతో ఈ సారి స్పాన్సర్లకు పండగేనని చెప్పవచ్చు.
Prabhas fans may finally start getting more updates about Fauzi from this month. Mythri Naveen…
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…