
ఎలిమినేటర్ మ్యాచ్ ను పరిశీలిస్తే… తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 128 పరుగులను మాత్రమే నమోదు చేయగలిగింది. కెప్టెన్ వార్నర్ 37 పరుగులతో టాప్ ఎండ్ లో రాణించగా, చివరి ఓవర్లలో విజయ్ శంకర్ 22 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ అయినా సాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ ను నిలువరించడంలో కెప్టెన్ గంభీర్ పన్నిన వ్యూహం సక్సెస్ అయ్యింది. నాథన్ కోల్టర్ మూడు వికెట్లతో సత్తా చాటగా, ఉమేష్ యాదవ్ 2 వికెట్ల నేలకూల్చాడు.
అయితే హైదరాబాద్ ఇన్నింగ్స్ అనంతరం ఒక్కసారిగా వరుణుడు ప్రతాపం చూపడంతో కోల్ కతా బ్యాటింగ్ చేపట్టడం కష్టసాధ్యమనే అంతా భావించారు. ఒకవేళ కోల్ కతా బ్యాటింగ్ చేపట్టని పక్షంలో, మూడవ స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు క్వాలిఫైయర్ 2కు వెళ్తుందనే సమాచారంతో సన్ రైజర్స్ అభిమానులు ఆనందపడ్డారు. ఎందుకంటే హైదరాబాద్ ఇచ్చిన 129 పరుగుల లక్ష్యం ఏ జట్టుకైనా మంచినీళ్ళ ప్రాయమే కావడంతో, సన్ రైజర్స్ ఓటమి దాదాపుగా ఖరారైంది. దీంతో వరుణుడు ఆదుకున్నాడు అంటూ సంబరపడం సన్ రైజర్స్ ఫ్యాన్స్ వంతయ్యింది.
అయితే అర్ధరాత్రి 12 గంటల సమయానికి వర్షం తగ్గిపోవడంతో, పిచ్ ను పరిశీలించిన ఎంపైర్లు డక్ వర్త్ లూయిస్ ప్రకారం కోల్ కతా లక్ష్యాన్ని 6 ఓవర్లలో 48 పరుగులుగా నిర్దేశించారు. ఇక ఒంటి గంటకు ప్రారంభమైన మ్యాచ్ లో 1.1 ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కోల్ కతాను కెప్టెన్ గంభీర్ ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. లక్ష్యం తక్కువే అయినా, ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో… 19 బంతుల్లో 32 పరుగులు చేసిన గంభీర్ ఇన్నింగ్స్ ప్రశంసలు అందుకుంది. దీంతో 5.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించడంతో, సన్ రైజర్స్ ప్రస్థానం ముగిసిపోయింది.
లీగ్ మ్యాచ్ లలో హైదరాబాద్ విజయం సాధించడానికి ఎంపైర్లు ఇచ్చిన తప్పుడు నిర్ణయాలు వరంగా మారి, కీలకమైన మ్యాచ్ లలో ఒక రకంగా సన్ రైజర్స్ విజయానికి కారణమయ్యాయి. అలాగే వార్నర్ దూకుడైన బ్యాటింగ్ విజయాలను తెచ్చిపెట్టింది. కానీ, ఎలిమినేటర్ మ్యాచ్ లో మాత్రం వీరెవరూ ఆదుకోలేకపోయారు. కోల్ కతా అదృష్టవశాత్తూ ఎంపైర్లు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు ఇవ్వకపోగా, వార్నర్ కూడా చాలా సేపు క్రీజులో ఉన్నప్పటికీ స్థాయికి తగిన విధంగా పరుగులను సాధించలేకపోయాడు.
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…