
ఐపీఎల్ 2024 సీజన్ లో బోణి కొట్టని ఏకైక జట్టుగా నిలిచింది ముంబై ఇండియన్స్. ఇప్పటికే ఐపీఎల్ లో13 మ్యాచ్ లు ముగవగా, ఇందులో ముంబై జట్టు సైతం 2 మ్యాచ్ లలో తలపడగా, రెండింటిలోనూ వారు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు.
సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఫాన్స్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫాన్స్ ముంబై జట్టు పై ట్రోల్ల్స్ మరియు కెప్టెన్సీ మార్పు పై తమ అసహనాన్ని వ్యక్తం చేసారు. దానికి తోడుగా కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా కెప్టెన్సీ విషయం లో తన మార్క్ ను చూపించటం లో ఏ మేరకు ప్రభావం చూపలేక పలు విమర్శలను మూటకట్టుకున్నారు.
గ్రౌండ్ లో పాండ్య ప్రవర్తన పట్ల, తోటి ఆటగాళ్లతో అతని నడవడిక పట్ల అసహనానికి గురైన క్రికెట్ అభిమానులు హార్దిక్ పాండ్య టాస్ కోసం వచ్చినప్పుడే, అంతా పాండ్య ను ‘బూ’ అంటూ అరుస్తూ తమ ద్వేష భావాన్ని చూపిస్తున్నారు. అలాగే తిరిగి హిట్ మ్యాన్ రోహితే కెప్టెన్ గా కావాలి అంటూ ఫాన్స్ అంతా కోరుకుంటున్నారు.
అయితే ఈ సీజన్ లో మొదటి సారి ముంబై జట్టు ఈ రోజు తమ హోమ్ గ్రౌండ్ లో ఆడనున్నారు. అయితే ఈ విషయమై సంతోషం గా ఉండాల్సిన జట్టు మేనేజ్మెంట్ ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయట గ్రౌండ్ లోనే టీం కెప్టెన్ అయిన హార్దిక్ పైన ఆ మేరకు బూ చేస్తే, ఇక తమ సొంత గ్రౌండ్ లో రోహిత్ ఫాన్స్ చేసే రచ్చ ఎలా ఉండబోతుందో అనే సందిగ్ధం లో ఉన్నారు జట్టు మేనేజ్మెంట్.
అయితే ఇవాళ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్న ‘ముంబై vs రాజస్థాన్’ మ్యాచ్ కు 7 గంటలకు టాస్ వేయనుండగా, పలు రిపోర్ట్స్ తో తెలిసినదేమనగా, ఇవాళ పాండ్య ను ‘బూ’ చేసిన వారికి ఏదో ఒక శిక్ష ఖాయమంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇలా హార్దిక్ ను టీజ్ చేస్తున్నవారిని అరెస్ట్ చేస్తారంటూ, లేదా ఏదొక చిన్నపాటి ఫైన్ అయినా వేస్తారంటూ ప్రచారం ఊపందుకుంది.
మరి ఈ వార్తలలో నిజమెంతో తెలియాలంటే మ్యాచ్ మొదలుకావాల్సి ఉంటుంది. అయితే ముంబై vs రాజస్థాన్ మ్యాచ్ లో ఇప్పటికే ముంబై ఆడిన రెండు మ్యాచ్ లలోను ఓటమి చెందగా, రాజస్థాన్ ఆడిన రెండింటిలోనూ విజయం సాధించింది. ఈ మ్యాచ్ అటు ముంబై టీం కే కాదు హార్దిక్ కెప్టెన్సీ కి ఒక అగ్ని పరీక్షే అని చెప్పవచ్చు. ఇప్పటికైనా కెప్టెన్ గా టీం అందరిని కలుపుకుని ముందుకెళ్లగలిగితే హార్దిక్ పాండ్య కు ముంబై ఫాన్స్ నుండి మద్దతు దక్కే అవకాశం లేకపోలేదు.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…