Telugu

వైసీపీ ప్రభుత్వం దెబ్బకి బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మటాష్?

రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచేందుకు హామీలు ప్రకటించి గెలిచి అధికారంలోకి వచ్చేక వాటిని అమలుచేస్తుంటాయి. కానీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం దేశంలో వైసీపీ మాత్రమే. ఇంత దూరదృష్టి ఉన్న వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమ పధకాల కోసం అప్పులు చేసుకొంటూపోతే చివరికి రాష్ట్రం ఏమవుతుంది అనే ఆలోచనలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

వైసీపీ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకపోయినా ఎక్కడి నుంచి ఏవిదంగా డబ్బులు రాల్చుకోవచ్చనే తెలివితేటలు చూసి కేంద్ర ప్రభుత్వమే షాక్ అవుతోంది. ఓ పక్క అప్పుల కుప్పలు పేరుకుపోతుంటే, కేంద్రం నుంచి వివిద పధకాలకు, పనులకు వస్తున్న నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించేస్తోంది.

ADVERTISEMENT

పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించేస్తోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, పంచాయతీల పేరిట బ్యాంక్ ఖాతాలు తెరిపించి వాటిలోనే నిధులు జమా చేయాలనుకొంది. కానీ వాటిలో నిధులు జమాకాక మునుపే వైసీపీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి లాగేస్తోంది. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను కరెంటు బాకీల కింద జమా చేసేందుకు రంగం సిద్దం చేసింది.

అంతకు ముందు వైసీపీ ప్రభుత్వం పంటల మార్కెట్ ఫీజులు పెంచి దానిని అదనపు ఆదాయంగా చూపుతూ మార్క్ ఫెడ్ ద్వారా రూ.1,700 కోట్లు అప్పు తెచ్చింది. దానికంటే ముందు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్‌కు రాబోయే ఆదాయాన్ని చూపి రుణాలు తీసుకొంది.

రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ కూడా శ్రీలంకలా దివాళా తీసే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రంతో పాటు వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులు కూడా మునిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే కేంద్ర ఆర్ధికశాఖ, రిజర్వ్ బ్యాంక్ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చివరికి ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమవుతుందో?రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయినా చెప్పగలరో లేదో?

Watch and subscribe for Exclusive Interviews:

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కేంద్రంతో కటీఫ్‌.. జగన్‌ సిద్దపడుతున్నట్లేనా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్‌ ప్రక్రియలో టీడీపి గూండాయిజం చేసిందని…

3 minutes ago

హైదరాబాద్‌ మెట్రో నష్టాలు 405 కోట్లు.. ఏపీ తప్పించుకుందిగా!

ఆలస్యం అమృతం విషం, అలాగే నిదానమే ప్రధానమనే రెండు మాటలు వినిపిస్తుంటాయి. ప్రభుత్వాలు వివిధ కారణాలతో ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం…

8 minutes ago