Telugu

పవన్ ను ‘కుల – ప్రాంతీయ’ రాజకీయ గాలి కమ్మేస్తుందా.?

పవన్ టార్గెట్ గా అటు ఏపీలో జరుగుతున్న ‘కుల’ రాజకీయాలు ఇటు తెలంగాణలో మొదలైన ‘ప్రాంతీయ’ రాజకీయాలు ఎన్నో సందేహాలకు కారణంగా మారుతున్నాయి, అలాగే అందుకు వేళ్లన్ని కొందరి వైపే తిరుగుతున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా పవన్ టార్గెట్ గా ఆయన కుటుంబం పై తెలంగాణలో ప్రెస్ మీట్లు పెట్టి సమాజం సిగ్గు తో తలదించుకునే స్థాయిలో నీచాతి నీచంగా విమర్శించారు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి.

ADVERTISEMENT

ఇక టాలీవుడ్ వివాదాస్పద దర్శకుఢు రాంగోపాల్ వర్మ సైతం అదే ధోరణి లో పవన్ టార్గెట్ గా సినిమాలు తియ్యడం, సోషల్ మీడియా వేదికగా పవన్ పై దారుణమైన పోస్టులు చెయ్యడం ఒక హాబీ గా పెట్టుకున్నారు. అయితే ఈ ఇద్దరు కూటమి రాకతో రాజకీయ విమర్శలకు తాత్కాలిక విరామం ప్రకటించారు.

ఇలా ఏపీలో రాజకీయాలు చేసే పవన్ టార్గెట్ గా తెలంగాణలో స్థిరపడిన ఇండస్ట్రీ వారు బయటకు రావడం వెనుక వైసీపీ కీలక హస్తం ఉందనేది జగమెరిగిన సత్యమే. తాడేపల్లి ప్యాలస్ ఆదేశాలతోనే వారంతా గతంలో పవన్ పై విరుచుకుపడడం, అందుకు ప్రతిగా వైసీపీ నుంచి వారు లబ్ది పొందడం అందరికి తెలిసిన విషయమే.

అయితే అందంతా వైసీపీ చేసిన అంతర్గత రాజకీయమే అని బహిర్గతం కావడంతో ఈ సారి కూడా పాత పద్దతిలోనే వైసీపీ ముందుకెళుతుందా.? లేదా సరికొత్త నీరును రంగంలోకి దింపుతుందా.? అన్న ప్రశ్నలు మొదలైన వేళ అనూహ్యంగా ఏపీలో కాపు కుల నేతలుగా చెప్పుకునే కొంత మంది పవన్ పై కుల రాజకీయ ఒత్తిడులు చేయడం,

తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదంతో తెలంగాణ జర్నలిస్టుల పేరుతో ప్రాంతీయవాద రాజకీయానికి తెరలేపడం ఏకకాలంలో జరిగిపోయింది. అయితే వీటి అన్నింటి ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయా.? ఎవరి జెండా రాజకీయ లబ్ది కోసమో జనసేన జెండా కు కుల, ప్రాంతీయవాద రాజకీయ రంగు పూస్తున్నారా.? అనే అనేక ప్రశ్నలు జనసేనికులను వెంటాడుతున్నాయి.

ముగిసిన అధ్యాయం అంటూ నాగేశ్వరరావు వివాదాన్ని ముగించి మరో కొత్త వివాదంతో సరికొత్త అధ్యాయాన్ని తెరిచేందుకు సిద్దమయ్యారా.? అందుకు పవన్ ను రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసేందుకు రాజకీయ విశ్లేషకుల ముసుగులో నాగేశ్వరరావు టీం ముందుకొచ్చిందా.? నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన నాగేశ్వరరావు ప్రెస్ మీట్ అందుకు సంకేతంగా మారిందా.?

అలాగే ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ ను తన సామాజికవర్గం కోసం ఏం చేస్తున్నారంటూ కాపు నేతలుగా చెప్పుకునే వారు ఆయనపై విమర్శలకు దిగడం, తమకు నచ్చే విధంగా రాజకీయాలు నపడకపోతే జనసేనకు కాపు కులాన్ని దూరం చేస్తామంటూ బెదిరింపులకు దిగడం, డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన పవన్ ను కుల నాయకుడిగా మార్చాలనుకోవడం దేనికి సంకేతం.?

అయితే ఈ రెండు రకాల రాజకీయాల వెనుక ఉన్న ఆ అదృశ్య రాజకీయ శక్తి ఎవరు అన్నదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రశ్నలు ఎన్నైనా, అవి ఎంతలా పవన్ ను ఉక్కిరిబిక్కిరి చెయ్యాలనుకున్నా రాజకీయ సమాధానం కోసం జనసైనికుల కళ్లన్నీ ఫ్యాన్ గాలికోసమే ఎదురుచూస్తుంటాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47: Trivikram & Naga Vamsi Fumble Golden Dasara Window

Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…

6 hours ago

New Passport Rules for Minors NRI Parents Must Know

The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…

6 hours ago