సానుభూతికి కొడాలి అర్హుడా.?

బూతుల మంత్రిగా గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరువును జాతీయ వేదికలెక్కించిన మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ నాయకుడు కొడాలి నాని నిత్యం మీడియాలో కొచ్చి చంద్రబాబు, లోకేష్ పై రాయలేని భాషతో, చెప్పలేని విధంగా రెచ్చిపోయేవారు.

కానీ ఇప్పుడు అదే మీడియాలో అదే నాయకుడి ఆరోగ్య పరిస్థితి పై లైవ్ అప్ డేట్స్ వస్తున్నాయి. ఖర్మ ఫలం అంటే ఇదేనేమో అనే విధంగా నాడు ఇష్టానుసారంగా, అధినేత మెప్పుకోసం ఇంగితం మరిచి ప్రజల సాహసాన్ని మరిచి ప్రవర్తించిన కొడాలి, ఇప్పుడు అదే
ప్రజల సానుభూతిని కోరుకుంటున్నాడు. అసలు నాని అందుకు అర్హుడేనా.?

ADVERTISEMENT

నాని బూతు రాజకీయం విషయంలో ప్రజలలో వచ్చిన వ్యతిరేకత ఒక్క గుడివాడలోని కాదు చివరికి జగన్ సొంత ఇలాకా కడపలో కూడా వైసీపీ ఓటమికి బాటలు వేసింది. కేవలం తన స్వయం కృతాపరాధం తో ప్రజలలో ఏర్పరుచుకున్న అంతటి ద్వేషాన్ని నాని తన గుండె పోటు తో ఇప్పుడు పోగొట్టుకోగలరా.?

నాని కి గుండె పోటు, చికిత్స కోసం హైద్రాబాద్ తరలింపు, కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి చెయ్యి దాటుతుందా.? మెరుగైన చికిత్స కోసం ముంబై ఆసుపత్రికి తరలింపా.? ఇలా కొడాలి హెల్త్ బులిటెన్ ఆయన అనుచరులను, ఆయన మద్దతుదారులను కలవరపెడుతున్నాయి.

అయితే కొడాలి నాని ఇప్పుడున్న పరిస్థితి పై ఆయన అభిమానులను, అనుచరులను పక్కన పెడితే సామాన్య ప్రజానీకం కొడాలి విషయంలో మెత్తగిల్లారా.? ఆయన పరిస్థితి పై ప్రజలలో ఏమైనా సానుభూతి వచ్చిందా.? అంటే అయ్యో పాపం అనే వారికన్నా చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు.

గత ఐదేళ్లు వైసీపీ అరాచకవాదులుగా ముద్ర వేసుకున్న అనేకమంది వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి, వర్రా రవీంద్ర రెడ్డి, బోరుగడ్డ అనిల్ కుమార్, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, జోగి రమేష్, నందిగామ సురేష్ వంటి ముఖ్య నేతలంతా తమ పాప ప్రక్షాళనలో భాగంగా జైలు బాట పట్టినవారే.

అయితే ఈ లిస్ట్ లో నెక్స్ట్ జైలు గడప తొక్కబోయేది ఈ గుడివాడ వైసీపీ గుండానే అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా నానికి వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. రెడ్ బుక్ లో నెక్ట్ చాప్టర్ త్వరలో నాని కోసం తెరుచుకోబోతుంది అంటూ టీడీపీ శ్రేణులు కూడా ఆ పేజీ కోసం ఆశగా, ఆ త్రంగా ఎదురు చూసిన సందర్భాలు అనేకం.

అలాగే రెడ్ బుక్ రూపకల్పి, మంత్రి నారా లోకేష్ కూడా మన రెడ్ బుక్ చూసి కొంతమంది వైసీపీ నాయకులకు గుండె పోటు వస్తుంది, కొంతమంది భయంతో బాత్రూమ్ లో జారిపడి చేతులు విరగొట్టుకుంటున్నారు తమ్ముళ్లు అంటూ నానిని ఉదహరించిన వైనం మనం చూసాం.

అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు నాని హెల్త్ బులిటెన్ విడుదల కాగా అసలు నానికి ఏమైంది.? అనేవారు కొంతమందైతే, నాని కి ఇది జరగాల్సిందే అనే వారు ఇంకొందరు. ఏదిఏమైనా రాజకీయాలలోకి మానవీయ విలువలు మరచి, వ్యక్తిగత ద్వేషాన్ని నింపుకుని చివరికి కొడాలి సాధించిందేమిటి.? అంటే బలమైన పట్టున తన నియోజవవర్గంలో తన ప్రజల నుంచి ఓటమి అనే ఛీత్కారం, భయపడ్డాడు అనే అవమానం.

రాజకీయాలలో అధికార, ప్రతిపక్షాలనేది నాణానికి ఉండే బొమ్మ, బొరుసు లాంటివి, ఒక సారి బొమ్మ మనకు వస్తే మరోసారి ఆ అవకాశం మన ప్రత్యర్థి కి దక్కుతుంది. యద్భావం తద్భవతి…గతి యంతో మతి అంతే….అన్నట్టుగా మనం ఎం ఆలోచిస్తే అదే తిరిగి వస్తుంది అనేలా కర్మ ఫలం ఎవ్వరిని ఉపేక్షించదు. కాకపోతే ఒక్కో సారి రావడం కాస్త లేట్ అవుతుంది…కానీ రావడం మాత్రం పక్కా అనేది తేలిపోయింది.

కొడాలి నాని ఆరోగ్యం తో పాటుగా ఆయన ఆలోచన దృకపథం కూడా మెరుగుపడి తిరిగి తన రాజకీయం జీవితంలో మనవతా విలువలతో కూడిన రాజకీయాలు, విశ్వసనీయతతో కూడిన ప్రజా పోరాటానికి నాని సిద్ధం కావాలని ఆశిద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Priyanka Chopra Picks Hari Krishna’s Seethayya Scene

Priyanka Chopra has given Telugu cinema fans an unexpected throwback. The actress reshared a reel…

18 minutes ago

Jagan Misses Logic About CBN’s Cases?

Former chief minister YS Jagan addressed the media again today. A significant part of his…

48 minutes ago