Telugu

వైసీపీ శ్రేణులకు జగన్ హీరో అయితే విలన్ .?

ఏ పార్టీ లో అయినా పార్టీ క్యాడర్ కి లీడర్ల కు ఆ పార్టీ అధినేతే హీరో. అలాగే వైసీపీ నేతలకు, వైసీపీ పార్టీ మద్దతుదారులకు జగన్ ఎప్పటికి హీరో నే అయినా విలన్ మాత్రం సజ్జల అవుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుందా.?

సకల శాఖ మంత్రిగా వైసీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన సజ్జల నేటి పార్టీ దుస్థితికి పరోక్ష కారణంగా మారారు అనే విమర్శలను మూటకట్టుకున్నారు.

ADVERTISEMENT

నాటి వైసీపీ మూడు రాజధానుల ప్రకటన నుంచి నేటి జగన్ మావిగన్ ప్రతిపాదన వరకు తెరవెనుక చక్రం తిప్పింది సజ్జలే అన్న కీలక ఆరోపణలు సొంత పార్టీ క్యాడర్ నుంచే బలంగా వినిపించాయి.

నాటి విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక నేటి బోరుగడ్డ నిరసన ముందు కూడా సజ్జల తెరచాటు రాజకీయమే కనిపిస్తుందా.?పార్టీ కోసం కేంద్ర బీజేపీ తో పైరవీలు సాగించిన విజయసాయి నుంచి పార్టీ కోసం ప్రత్యర్థి నాయకుల మీద నీచమైన విమర్శలు చేసిన బోరుగడ్డ వరకు సజ్జల కేంద్రంగా ఎందుకు విమర్శలు సాగిస్తున్నారు.

జగన్ చుట్టూ ఉన్న కోటరీ లో సజ్జల కీ రూల్ ప్లే చేస్తున్నారా.? ఆయన ఆదేశాలనే జగన్ తూచా తప్పకుండా పాటిస్తున్నారా.? పార్టీకి అధికారికంగా అధినేతగా జగన్ ఉన్నప్పటికీ అనధికారికంగా సజ్జలే పార్టీ అధినేత పాత్ర పోషిస్తున్నారా.? నాడు మీడియా ముందు నేడు తెరవెనుక సజ్జలే చక్రం తిప్పుతున్నారా.?

నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ మెప్పు కోసం, జగన్ దృష్టిని ఆకర్షించడం కోసం కనీస మానవతా విలువలు కూడా పాటించకుండా సోషల్ మీడియాలో వైసీపీ కోసం రెచ్చిపోయిన శ్రీ రెడ్డి నుంచి బోరుగడ్డ వరకు పార్టీ తమకు అన్యాయం చేసిందనే భావనలోకి ఎందుకు వెళుతున్నారు.

నాడు వారి దుస్సాహసాలను ఖండించని జగన్ నేడు వారిని నిరసనలకు స్పందించి ముందుకొస్తారా.? నాడు జగన్ ప్రోత్సాహం లేకుండానే శ్రీ రెడ్డి, బోరుగడ్డ వంటి వారిని సజ్జల ప్రోత్సహించారా.? అలాగే నేడు జగన్ ఆదేశాలు ఇవ్వకుండానే సజ్జల బోరుగడ్డను పార్టీకి దూరం చేస్తున్నారా.? జగన్ ను చేరుకోనివ్వడం లేదా.?

అలాగే పార్టీలో నెంబర్ 2 గా ఉండే సాయిరెడ్డి కోటరీ రాజకీయం లో నలిగిపోతున్న విషయం జగన్ దృష్టికి రాలేదా.? సాయిరెడ్డి వంటి కీలక నేత ను కూడా జగన్ కు దూరం చెయ్యగలిగే శక్తి కోటరీ కి ఉందంటే వైసీపీ లో జగన్ కంటే కూడా కోటరీ నే బలమైన రాజకీయ శక్తి గా ఎదిగిందా.?

జగన్ కూడా కోటరీ చేతిలో కీలుబొమ్మగా మారుతున్నారా.? జగన్ ఎవరిని కలవాలో, జగన్ తో ఎవరు కలవాలో కూడా సజ్జల నిర్దేశిస్తున్నారా.? నాటి విజయసాయి ఆరోపణల వెనుక నేటి బోరుగడ్డ ఆవేదన కు సజ్జలే కారణమా.? వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన సాయిరెడ్డి కూడా జగన్ ను పక్కన పెట్టి జగన్ కోటరీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు.

ఇక నేడు అదే మాదిరి బోరుగడ్డ అనిల్ సైతం జగన్ ను తప్పించి తెరముందుకు సజ్జలను విలన్ గా చిత్రీకరిస్తున్నారు. అంటే వైసీపీ శ్రేణులకు జగన్ హీరో అయినా చివరికి సజ్జల మాత్రం విలన్ గా మారుతున్నారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

KA’s Reality Title Glimpse: A Feel-Good Take

Kiran Abbavaram is coming up with an entertainer, #KA13. Written and directed by Kiran Abbavaram…

4 minutes ago

New Plague Outbreak: Is It Worse Than Covid?

The last time the world came to a lockdown was during the Covid outbreak in…

11 minutes ago