సమంత నే మీడియాలో విడాకుల వార్తలు వచ్చేలా చేస్తుందా?

Is Samantha spreading the news of divorce in mediaగత కొద్ది రోజులుగా నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నటున్నారు అనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సహజంగానే మీడియాకు దూరంగా ఉండే నాగచైతన్య పెదవి విప్పడం లేదు. సమంత ఒకటి రెండు ఇంటర్వ్యూలలో అడిగినా సమాధానం దాటవేస్తుంది.

దానితో ఎవరికి తోచింది వారు రాసుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు దగ్గర నుండి సమంతకు వచ్చే భరణం వరకు ఎవరికి కావాల్సింది వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఆ విషయం గురించి అటు నాగచైతన్య గానీ ఇటు సమంత గానీ మాట్లాడటానికి ఇష్టపడటం లేదు అనేది స్పష్టం అవుతుంది.

ADVERTISEMENT

అయితే సహజంగా ఎవరైనా ఒక విషయం గురించి మాట్లాడకపోతే కొద్ది రోజులు సైలెంట్ అయిపోతారు. మీడియాకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఎక్కడైనా ఇది సహజంగా జరిగేదే. సమంత మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. అదీ గాక సోషల్ మీడియా మరీ ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు, మెస్సేజ్లు పెడుతుంది.

పైగా అక్కడ మెస్సేజ్లలో ఏవో క్రిప్టిక్ మెస్సేజ్లు పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి మెస్సేజ్ గురించి మీడియాలో విరివిగా కవేరేజ్ వస్తుంది. పనిలో పనిగా విడాకుల గురించి కూడా రాసేస్తున్నారు. ఆ మెస్సేజ్లకు జరుగుతున్న విడాకుల తంతుకు ఏమైనా సంబంధం ఉందా అంటూ రంద్రాన్వేషణ చేస్తున్నారు.

ఆ రకంగా విడాకుల టాపిక్ మీడియాలో హాట్ గానే ఉంటుంది. తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో గానీ సమంతనే ఆ టాపిక్ ని ఫ్రెష్ గా ఉంచుతుంది.

ADVERTISEMENT
Latest Stories