రాష్ట్రంలో జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలా లేక లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలా?అన్నట్లు ఎక్కడికక్కడ ఘర్షణలు, ఉద్రిక్తతల మద్య నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది.
అధికారంలో ఉన్నందున టీడీపి దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను, వైసీపీ శ్రేణులను భయబ్రాంతులను చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
ఈ ఎన్నికలలో అల్లకల్లోల్లం సృష్టించేందుకు వైసీపీ ఇతర రాష్ట్రాల నుంచి రౌడీ మూకలు తీసుకు వచ్చి టీడీపి శ్రేణులు, అభ్యర్ధులపై దాడులు చేయిస్తోందని టీడీపి ఆరోపిస్తోంది.
తమ హయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో చేసిన దౌర్జన్యాలు మరిచిపోయినట్లు వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం ఖూనీ అయిపొందంటూ మొసలి కన్నీళ్ళు కార్చుతుండటం విచిత్రంగా ఉంది.
నాడు తమ హయాంలో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో ఇచ్చిన ప్రకటనలను మరిచినట్లు, ఇప్పుడు జరుగుతున్న ఏకగ్రీవాలన్నిటిపై స్టే విధించాలంటూ వైసీపీ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం మరో విడ్డూరం.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టి మేము అధికారంలోకి వస్తే ఒక్కో అధికారి, ఒక్కో టీడీపి నాయకుడి భరతం పడతామని బెదిరించడాన్ని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఎందుకు పరిగణించడం లేదో?
ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పగా, అల్లర్లు జరుగుతాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పారంటే అర్థం ఏమిటి?ఈ ఎన్నికల ప్రక్రియపై పదేపదే హైకోర్టు, సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్లు వేస్తోందంటే అర్థం ఏమిటి? అని రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి.
కనుక పోలింగ్ రోజున ఎటువంటి అవాంచనీయ పరిణామాలు జరుగకుండా రాష్ట్ర ఎన్నికల కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం చాలా అవసరం.





