
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో వైసీపీ చాల బలంగా తన గొంతు విప్పి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా మాట్లాడగలిగింది అంటే అవి రెండే రెండు అంశాలు. ఒకటి వైకుంఠ ఏకాదశీ తిరుమల తిరుపతి స్వామి వారి దర్శనానికి గాను టికెట్ల క్యూ లైన్లో జరిగిన తొక్కిసలాట, ఆ పై సంభవించిన మరణాలు.
మరొకటి నేడు అక్షయతృతీయ, సింహాచలం అప్పన్న చందనోత్సవ వేడుకలలో జరిగిన అపశృతి. ఈ రెండు విషయాలలో అనుకోని ఘటనలతో కొంతమంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు సందర్భాలలోను ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనేది ఊహించిన అంశమే.
అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యం, అలసత్వం కొన్ని కుటుంబాలకు తీరని విషాదాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఇందులో నేరుగా ప్రభుత్వ తప్పిదం లేనప్పటికీ దీని పూర్తి బాధ్యత మాత్రం ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కావడంతో ఇది కచ్చితంగా ప్రభుత్వ ఫెయిల్యూర్ గానే విపక్షాలు రాజకీయం చేస్తాయి, చేస్తున్నాయి కూడా.
తిరుమల ఘటన మరువక ముందే ఇప్పుడు సింహాచలం లో మరో దురదృష్ట సంఘటన, తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అంటూ జరగని పాపానికి పరిహార దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పుడేం బదులిస్తారు అంటూ వైసీపీ పవన్ సనాతన ధర్మం పై విరుచుకుపడుతుంది.
అలాగే మొన్న వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తప్పిదానికి క్షమాపణలతో తప్పించుకున్న ప్రభుత్వం ఇప్పుడేం చెపుతుంది అంటూ వైసీపీ స్వరం పెంచి మరి కూటమి ప్రభుత్వం పై విమర్శనాభాణాలు సంధిస్తుంది. వైసీపీ మాజీలంతా మీడియా ముందుకొచ్చి సింహాచలం దారుణ సంఘటన పై ప్రభుతావనికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.
అయితే ప్రభుత్వాలు విచారణ కమిటీలు వేసో, బాధిత కుటుంబాలకు పరిహారాలు చెల్లించో, వైసీపీ విమర్శలను తిప్పికొట్టో ఈ పొరపాట్లను కప్పిఉంచలేరు. ఈ సంఘటనకు బాధ్యులైన వారి పై తక్షణమే చర్యలు తీసుకోవాలి,
అలాగే ఇటు ప్రజల నుంచి అటు ప్రతిపక్షాల నుంచి వస్తున్న సద్విమర్శలు స్వీకరించి మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ఇవి ప్రభుత్వ చేతకానితనంగా ప్రజలు భావించే ప్రమాదం లేకపోలేదు.
ఎస్ఐఆర్ పేరుతో దేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఎన్నికల కమీషన్ కలిసి నిర్వహిస్తున్నయా?…
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…