
ఆపరేషన్ సింధూర్ చేపట్టే ముందు ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, హోమ్ మంత్రి అమిత్ అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్, త్రివిధ దళాధిపతులతో వరుస సమావేశాలు నిర్వహించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆ సమావేశాలు ముగిసిన తర్వాత 24-36 గంటలలో భారత్ దళాలు తమపై దాడిచేయబోతున్నాయని పాక్ మంత్రులే చెప్పుకున్నారు.
కానీ కేంద్ర ప్రభుత్వం భారత్ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చినప్పటికీ ఏమాత్రం తొందరపడకుండా సుమారు రెండు వారాల సమయం తీసుకొని అన్నీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే మే 7 అర్దరాత్రి 1.40 గంటలకు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేశాయి.
ఆ రోజు నుంచి నేటి వరకు పాక్ దళాలు డ్రోన్లు, క్షిపణులతో భారత్‌పై విరుచుకుపడుతూనే ఉంది. అందుకు సిద్దంగా ఉన్న భారత్ దళాలు తిప్పికొడుతూనే ఉన్నాయి. అయితే పాక్ పదేపదే భారత్‌పై దాడులు చేస్తున్నా వాటిని అడ్డుకుంటోందే తప్ప పాకిస్థాన్‌పై పెద్దగా ప్రతి దాడులు చేయడంలేదు.
కానీ భారత్‌పై దాడికి తోడ్పడుతున్న పాక్‌లోని సైనిక స్థావరాలను, పాక్ ఎయిర్ బేస్‌లపై మాత్రమే దాడులకు పరిమితమవుతూ చాలా సంయమనం పాటిస్తోంది.
కానీ ఎప్పటిలాగే పాక్, భారత్ సంయమనాన్ని కూడా అలుసుగా తీసుకొని దాడులు తీవ్రత పెంచింది. శనివారం తెల్లవారుజామున అత్యంత ప్రమాదకరమైన ఫతే-2 క్షిపణితో దేశ రాజధాని ఢిల్లీపై దాడికి ప్రయత్నించడమే ఇందుకు నిదర్శనం. దానిని బరాక్-3 క్షిపణి రక్షణ వ్యవస్థతో హర్యానాలో కూల్చేశారు. లేకుంటే ఏం జరిగేదో కూడా ఊహించుకోలేము.
కనుక పాకిస్థాన్‌కు మరోసారి భారత్ తడాఖా రుచి చూపించాల్సిన సమయం వచ్చిన్నట్లే ఉంది. బహుశః అందుకే శనివారం ప్రధాని మోడీ నివాసంలో మళ్ళీ అత్యున్నత సమావేశం జరిగిందని భావించవచ్చు. ఒకవేళ ఈ సమావేశం ఆపరేషన్ సింధూర్-2 కోసమే అయితే ఈరాత్రి పాకిస్థాన్‌కు కాళరాత్రిగా మారబోతోంది. అవునో కాదో రేపు తెలుస్తుంది.
GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…
కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి, సీజేపీ చేస్తున్న ఆందోళనలను నిశితంగా గమనిస్తే భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయో అర్ధమవుతుంది.…