
2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు టాలీవుడ్ హైదరాబాద్ నుంచి ఏపీకి షిఫ్ట్ అయ్యే ఆలోచనలు చేసింది. కానీ టాలీవుడ్ అంటే ఓ ‘బంగారు బాతు’ అని, దానిని కాపాడుకుంటూ అది పెట్టే ‘బంగారు గుడ్లు’ మాత్రమే వాడుకోవాలనే ఇంగితం కేసీఆర్‌కి కలగడంతో, ఉద్యమ సమయంలో తరిమికొట్టాలనుకున్న టాలీవుడ్‌ని చంకనెక్కించుకున్నారు.
అలా అప్పుడు ఆయన చంకనెక్కిన టాలీవుడ్ అక్కడే హైదరాబాద్‌లో హాయిగా స్థిరపడిపోయింది. జగన్ దానిని బెదిరించి, భయపెట్టి లొంగదీసుకోవాలనుకున్నారు. కానీ అది జగన్ చేతికి చిక్కలేదు.
హైదరాబాద్‌లో అంతా బాగానే ఉంది కదా… అనుకుంటే అల్లు అర్జున్ అరెస్టు తదనంతర పరిణామాలతో టాలీవుడ్‌కి హైదరాబాద్ నగరం హటాత్తుగా యుద్ధభూమిలా మారిపోయింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తమపై ఈ స్థాయిలో విరుచుకుపడి, అప్పుడే టాలీవుడ్‌కి ‘ప్రివిలేజ్ శిక్ష’ కూడా విధించేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు డీజీపీ తదితర పోలీస్ ఉన్నతాధికారులు కూడా టాలీవుడ్‌ని వేలెత్తి చూపుతూ మాట్లాడుతుండటంతో, దాని పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిన్నట్లయింది.
కనుక టాలీవుడ్ ఇప్పుడు సాయం కోసం ఏపీ ప్రభుత్వం వైపు చూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలలో జోక్యం చేసుకోవడం అంటే శతృత్వం కోరి తెచ్చుకున్నట్లే. కనుక సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ సహాయపడక పోవచ్చు.
కానీ వారు టాలీవుడ్‌ని ఏపీకి తరలిరావలని ఆహ్వానిస్తున్నారు కనుక ఆ ఆలోచన చేయవచ్చు. ఇప్పటికిప్పుడు టాలీవుడ్ ఏపీకి తరలిరావడం అసంభవం. కానీ తెలంగాణలో ఇటువంటి సమస్యలు, అవమానాలు భరించడం కంటే ఏపీకి తరలిపోవాలనే ఆలోచన కలిగితే, రాబోయే 4 ఏళ్ళలో తరలి రావడం పెద్ద కష్టం కాబోదు.
ఏపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమకు చెందిన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, (త్వరలో) నాగబాబు ముగ్గురు ఉన్నారు. సినీ ప్రముఖులలో పలువురికి వారితో, సిఎం చంద్రబాబు నాయుడుతో బలమైన సత్సంబంధాలున్నాయి. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా సినీ పరిశ్రమ పట్ల చాలా సానుకూలంగానే ఉంటారు.
పైగా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్న ఈ సమయంలో టాలీవుడ్ కదిలి రావడానికి ఇదే సరైన సమయమని వేరే చెప్పక్కర లేదు.
తెలంగాణతో పోలిస్తే ఏపీ ప్రజలకి సినిమాలపై ప్రేమ చాలా ఎక్కువ. సినిమా స్టూడియోలు ఏర్పాటు చేసుకోవడానికి, షూటింగ్‌లు చేసుకోవడానికి ఏపీలో అన్ని హంగులూ ఉన్నాయి.
కొత్తగా మరో మూడు విమానాశ్రయాలు వస్తున్నాయి. కనుక ఇప్పటికైనా టాలీవుడ్ పుట్టింటికి తిరిగిరావడమే మంచిది. అయితే ఈ గొడవలన్నీ టీ కప్పులో తుఫానులా త్వరలోనే చల్లరిపోతే టాలీవుడ్ ఎప్పటిలాగే అత్తారింట్లో హాయిగా శేషజీవితం గడిపేయవచ్చు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…