
దీంతో ఈ సారి అడల్ట్, హార్రర్ ను పక్కనపెట్టి కామెడీ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ చేసుకుందట. అందులో భాగంగానే ఒకప్పుడు బుల్లితెరను ఏలిన ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రధాన పాత్రకు రష్మి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిసి స్థాపించిన నిర్మాణ సంస్థలో ఈ సినిమా నిర్మాణం జరుపుకోబోతోంది.
పెద్ద బ్యానర్ లో అవకాశం రావడంతో ఈ సినిమా అయినా తన సినీ కెరీర్ ను ఓ మలుపు తిప్పుతుందేమోనని ఈ ‘జబర్దస్త్’ బ్యూటీ ఆశలతో ఉందట. వెండితెరపై ఎన్ని అందాలు ఆరబోసినా, ఏ విధంగా భయపెట్టినా రానటువంటి సక్సెస్, ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తే వస్తుందని భావిస్తోందట. మరి ముంచినా నువ్వే, లేపినా నువ్వే అన్నట్లుగా ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వం వహించబోతున్న తొలి సినిమా రష్మి కెరీర్ కు అత్యంత కీలకమైన సినిమాగా మారనుంది.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…